Sky Smile: ఆ రోజు ఆకాశం నవ్వుతుంది.. ఆ అద్భుతాన్ని మీరు మిస్ కాకండి
Sky Smile అంతరిక్షం అనేది అనేక అద్భుతాలకు నెలవు. ప్రతిరోజు అందులో లెక్కకు మిక్కిలి అద్భుతాలు చోటు చేసుకుంటాయి. అవన్నీ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు పురి గొలుపుతుంటాయి.

Sky Smile: మనం సాధారణంగా ఎవరైనా నవ్వుతూ కనిపిస్తుంటే.. స్మైలీ ఫేస్ అని పొగుడుతుంటాం. కానీ అలాంటి నవ్వులు ఆకాశంలో కనిపిస్తే ఎలా ఉంటుంది.. ఆకాశం కొద్దిసేపు నవ్వుతూ అలా ఉంటే ఎలా ఉంటుంది.. అయితే ఈ అద్భుతం త్వరలో ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు ఉంటాయి. అనంత విశ్వంలో భూమి తప్ప మరో గ్రహం లో జీవులు మనుగడ సాగించడానికి అవకాశం ఉండదు. నిత్యం అద్భుతాల పుట్ట.. అనంత ఆశ్చర్యాలకు పెట్టని కోట అయిన అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఏప్రిల్ 25న విశ్వంలోని రెండు గ్రహాలు, చంద్రుడి (నాడు నెలవంకగా కనిపిస్తాడు) సమీపంలోకి వస్తున్నాయి. దీనివల్ల వినీలాకాశంలో స్మైలీ ఫేస్ (smiley face) ఏర్పడునుంది. ఈ విషయాన్ని ప్రముఖ సైన్స్ వెబ్ సైట్ లైవ్ సైన్స్ పేర్కొంది. ఆ సైట్ లో కనిపించిన కథనం ప్రకారం.. ఏప్రిల్ 25న తెల్లవారుజామున ముందు శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడి వద్దకు వస్తాయి. ఆరోజున చంద్రుడు నెలవంక లాగా కనిపిస్తాడు. ఈ మూడు స్మైలీ ఫేస్ ఆకృతిని ఆకాశానికి కల్పిస్తాయి.. అయితే ఒకవేళ గనుక ఆ రోజు ఆకాశం నిర్మలంగా ఉంటే కొద్ది సమయం మాత్రమే ఈ స్మైలీ ఫేస్ కనిపిస్తుంది. అయితే ఈ దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూడవచ్చు. అయితే ఈ అద్భుతం సూర్యోదయానికి ముందు కొంత సమయం మాత్రమే ఏర్పడుతుంది. దీనిని తూర్పు దిశలో భూమి లేదా సముద్రం.. ఒక రేఖ వద్ద నింగితో కలిసిపోతున్నట్టుగా ఉన్న ప్రాంతంలో దీనిని చూసేందుకు అవకాశం ఉంది. దీనిని శాస్త్రవేత్తలు eastern horizon అని పిలుస్తున్నారు..
ఆ వెబ్ సైట్ కథనంలో ఏముందంటే..
ఆ వెబ్ సైట్ లో పేర్కొన్న కథనం ప్రకారం ఆ గీతకు పై భాగంలో శుక్రుడు.. కింది భాగంలో శని.. ఉన్న తర్వాత.. క్రమక్రమంగా నెలవంక వద్దకు వస్తాయి. నెలవంక తో పాటు ఆ రెండు గ్రహాలు చిరునవ్వుతో ఉన్న ముఖంలాగా కనిపిస్తాయి. ఇక ఇదే విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సౌర విధానం అంబాసిడర్ బ్రెండా కల్బర్సటన్ ధ్రువీకరించారు.. అయితే ఈ స్మైలింగ్ ఫేస్ ను స్టార్ గేజింగ్ బైనాక్యులర్, లేదా టెలిస్కోప్ మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆకాశంలో గనుక మేఘాలు ఏర్పడితే చూసేందుకు అవకాశం ఉండదు. ఇక ఇదే క్రమంలో ఆ మూడింటి కింద బుధ గ్రహాన్ని కూడా చూసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలా ఏర్పడటం వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని.. ఇది సౌర కుటుంబంలో అరుదుగా జరిగే ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.