WhatsApp New Feature:వాట్సాప్‌లో టైపింగ్ కష్టాలు ఖతం.. కొత్త ‘గ్రూప్ వాయిస్ చాట్’ ఫీచర్ వచ్చేసింది!

WhatsApp New Feature:వాట్సాప్‌లో గ్రూపుల్లో పెద్ద పెద్ద మెసేజ్‌లు టైప్ చేసి చేసి అలసిపోతున్నారా? అయితే ఇది మీకు గుడ్‌న్యూస్. వాట్సాప్ తన యూజర్ల కోసం ఒక కొత్త, అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘గ్రూప్ వాయిస్ చాట్’ (Group Voice Chat). ఈ ఫీచర్‌తో ఇకపై గ్రూపుల్లో ఏమీ టైప్ చేయకుండా, నేరుగా మీ వాయిస్‌తో అందరితో మాట్లాడేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది? ఇది మీ చాటింగ్ అనుభవాన్ని ఎలా మారుస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
WhatsApp తీసుకొచ్చిన ఈ కొత్త ‘గ్రూప్ వాయిస్ చాట్’ ఫీచర్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రూపుల్లో ఎక్కువ టైప్ చేయడానికి ఇష్టపడని వారికి, కానీ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన వారికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇకపై గ్రూపుల్లో టైపింగ్ చేయడం, లేదా కాల్స్ చేయడం లాంటివి అవసరం లేదు. కేవలం ఒకే ఒక క్లిక్‌తో నేరుగా మీ వాయిస్‌తో గ్రూపులోని సభ్యులతో మాట్లాడడం మొదలుపెట్టవచ్చు. ఇది మీకు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.
Read Also:NEET PG : రెండు షిఫ్టుల్లో పరీక్ష వద్దంటూ పిటిషన్..సుప్రీంకోర్టులో NEET PG భవితవ్యం
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ గ్రూప్ చాట్ లోపలే పనిచేస్తుంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా ఎవరికీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘గ్రూప్ వాయిస్ చాట్’ను మొదలుపెట్టవచ్చు. మీరు చాట్ మొదలుపెట్టగానే, గ్రూపులోని మిగతా సభ్యులకు ‘వాయిస్ చాట్ స్టార్ట్ అయ్యింది’ అన్న ఒక నోటిఫికేషన్ వస్తుంది. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వాయిస్ చాట్‌లో చేరవచ్చు.. లేదా మధ్యలో బయటికి రావచ్చు. దీనిలో ఉన్న మరో మంచి విషయం ఏమిటంటే, ఇది హ్యాండ్స్-ఫ్రీగా పనిచేస్తుంది. అంటే, మీ పనులు చేసుకుంటూ కూడా ఈ చాట్‌లో పాల్గొనవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం iOS (ఐఫోన్), Android (ఆండ్రాయిడ్) రెండు రకాల యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఇది కొన్ని గ్రూపులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఈ ఫీచర్ కనిపించకపోతే మీ వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ (Android) లేదా Apple యాప్ స్టోర్ (iOS) నుంచి అప్‌డేట్ చేసుకోండి. అప్పుడు ఈ ఫీచర్ మీకు కనిపిస్తుంది.
Read Also:Viral : ముంబైలో వానల బీభత్సం.. నవ్వులు పూయిస్తున్న బాహుబలి మీమ్
ఈ కొత్త ‘గ్రూప్ వాయిస్ చాట్’ ఫీచర్ సాధారణంగా ఉపయోగించే వాయిస్ నోట్స్ (Voice Notes) కంటే చాలా భిన్నమైనది. వాయిస్ నోట్స్ అనేవి ఒకే వైపు నుంచి పంపే మెసేజ్‌లు. అంటే, మీరు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తే, అవతలి వారు దాన్ని వింటారు. అది వన్-వే కమ్యూనికేషన్. కానీ, ‘వాయిస్ చాట్’ అనేది ఒక లైవ్ గ్రూప్ కాలింగ్ లాంటి అనుభవాన్ని ఇస్తుంది. ఇది కాల్ ఆప్షన్‌పై క్లిక్ చేయకుండానే, నేరుగా గ్రూపులో లైవ్‌గా మాట్లాడుకునే అవకాశం ఇస్తుంది. ఇక్కడ గ్రూపులోని చాలా మంది సభ్యులు ఒకేసారి మాట్లాడుకోవచ్చు.. ఒకరికొకరు వినవచ్చు. ఇది గ్రూపు కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో గ్రూప్ కమ్యూనికేషన్ మరింత వేగంగా, సులువుగా మారుతుంది.