Youtube:యూట్యూబ్ క్రియేటర్లకు అలర్ట్.. హ్యాకర్ల నుంచి అకౌంట్‌ను కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Youtube:యూట్యూబ్‌లో రీల్స్, వీడియోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే, ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే మంచి కంటెంట్, హై క్వాలిటీ వీడియోలు ఉంటే సరిపోదు. మీ యూట్యూబ్ అకౌంట్‌ను కూడా సేఫ్ గా ఉంచుకోవాలి. చాలా మంది మంచి కంటెంట్, వీడియోలు చేయడంలో పడి యూట్యూబ్ అకౌంట్ సేఫ్టీని పట్టించుకోరు. ఇదే హ్యాకర్లకు కలిసోస్తుంది.హ్యాకర్ల నుంచి మీ యూట్యూబ్ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవాలంటే కొన్ని పాటించాలి. అవేంటో చూద్దాం.
1. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (Two-Factor Authentication) ఆన్ చేయాలి
యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేయగానే చేయాల్సిన మొదటి పని అకౌంట్ సేఫ్టీ మీద దృష్టి పెట్టడం. దీని కోసం మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఫీచర్‌ను ఆన్ చేయాలి. ఈ ఫీచర్ మీ అకౌంట్‌కు ఎక్స్ ట్రా సేఫ్టీ(సెక్యూరిటీ లేయర్) అందిస్తుంది.
ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత, ఒకవేళ ఎవరికైనా మీ అకౌంట్ పాస్వర్డ్ తెలిసినా కూడా, వారు మీ అకౌంట్‌ను ఓపెన్ చేయలేరు. ఎందుకంటే, పాస్‌వర్డ్‌తో పాటు, అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి వారికి ఒక కోడ్ కూడా అవసరం అవుతుంది. ఈ కోడ్ మీ ఫోన్‌కు వస్తుంది.
Read Also :Lava Shark 5G:శాంసంగ్, పోకోలకు షాక్.. రూ.8వేలకే అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్
2. స్ట్రాంగ్ పాస్వర్డ్ (Strong Password) సెట్ చేసుకోవాలి
యూట్యూబ్ అకౌంట్ కోసం హ్యాకర్లు ఊహించలేని, క్రాక్ చేయలేని ఒక స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. పొరపాటున కూడా ‘12345’ లాంటి ఈజీగా గుర్తు పెట్టుకునే పాస్‌వర్డ్‌లను పెట్టకండి. దీనికి బదులుగా అక్షరాలు (Letters), అంకెలు (Numbers), సింబల్స్ (Symbols) కలిపి ఒక డిఫరెంట్ పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది.
3. ఫేక్ ఈమెయిల్స్ (Fake Emails) పట్ల జాగ్రత్త
స్కామర్లు నకిలీ ఈమెయిల్స్ పంపుతుంటారు. అవి యూట్యూబ్ లేదా గూగుల్ నుంచి వచ్చినట్లు నమ్మిస్తుంటారు. ఈ ఈమెయిల్స్‌లో ప్రమాదకరమైన లింక్‌లు ఉంటాయి. వాటిని క్లిక్ చేసి లాగిన్ వివరాలు నింపమని అడుగుతారు. ఇలాంటి ఈమెయిల్స్ ఉచ్చులో అస్సలు పడకండి. ఎందుకంటే, ఈ ప్రమాదకరమైన ఈమెయిల్స్ మీ అకౌంట్ యాక్సెస్‌ను లాగేసుకునే అవకాశం ఉంది.
Read Also :IPL Scam : ఐపీఎల్ సెలక్షన్ పేరుతో ఆశ చూపించి..రూ.23లక్షలు కుచ్చుటోపీ పెట్టిన కేటుగాళ్లు
4. కంటెంట్ బ్యాకప్ (Content Backup) తప్పనిసరి
లక్షలు, కోట్లలో సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ అకౌంట్లపై హ్యాకర్ల కన్ను ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, మీ కంటెంట్‌ను హార్డ్ డ్రైవ్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌లో బ్యాకప్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయినా కూడా, మీరు కష్టపడి తయారు చేసిన కంటెంట్ పోకుండా ఉంటుంది. ఈ నాలుగు పనులు చేయడం ద్వారా మీ యూట్యూబ్ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.