BJP Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి దారేది?
BJP Telangana Local Body Elections ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాలని తెలంగాణ బీజేపీ నాయకులు ప్రయత్నలు చేస్తున్నారు.

BJP Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డాలని తెలంగాణ బీజేపీ నాయకులు ప్రయత్నలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రత్యేకించి కేడర్ కు సంబంధించినవి కాబట్టి నేతలు ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ అధిష్టానం సూచిస్తోందట.
అయితే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సానుకూల వాతావరణం ఇదే చాన్స్ అని తెలంగాణ బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు నిధులు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని అధిష్టనం నాయకులకు సూచిస్తోందట. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కే అధిక పట్టు ఉంది. మరి బీజేపీ అనుసరించబోతున్న కొత్త వ్యూహాలు ఎలా పనిచేస్తాయో చూడాలి.