Actress Khushbu: సినీనటి ఖుష్బుకు కీలక పదవి
Actress Khushbu తమిళనాడు బీజేపీలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

Actress Khushbu: బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు. ఇక తమిళనాడు బీజేపీలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఉపాధ్యక్షులుగా నియమితులైన 14 మంది జాబితా విడుదల చేశారు.
ఎం చక్రవరి, వీపీ దురైస్వామి, కేపీ రామలింగం, కరునాగరాజన్, శశికళ పుష్ప, కనక సభాపతి. డాల్ఫిన్ శ్రీధర్, ఏజీ సంపత్, జయప్రకాశ్, ఎం వెంకటేశన్, గోపాల్ స్వామి, ఎన్ సుందర పాల్ కనకరాజ్ లను పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షులుగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా కేశవ వినాయగం, బాలగణపతి, రామ శ్రీనివాసన్, మురుగానందం, కాత్యాయణి, ఏబీ మురుగానందం నియమితులయ్యారు.