Journalist Corruption: ఈ-పేపర్ జర్నలిస్ట్.. ఐనవోలు MRO కు 2 లక్షలు డిమాండ్
Journalist Corruption ఓ ఈ పేపర్ ఎడిటర్ ఐనవోలు ఎమ్మార్వోను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేపర్ జర్నలిస్టు ఐనవోలు ఎమ్మార్వో పై తరచూ వార్తా కథనాలు రాసేవాడు.

Journalist Corruption: ఓ ఈ-పేపర్ జర్నలిస్ట్ ఐనవోలు MRO కు 2 లక్షలు డిమాండ్ చేసిన వార్త వరంగల్ లో సంచలనం స్పష్టించింది. ఓ ఈ పేపర్ ఎడిటర్ ఐనవోలు ఎమ్మార్వోను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేపర్ జర్నలిస్టు ఐనవోలు ఎమ్మార్వో పై తరచూ వార్తా కథనాలు రాసేవాడు. ఎమ్మార్వో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశంతో వార్తా కథనాలను రాసేవాడు. అయితే ఆ జర్నలిస్ట్ ఆ ఎమ్మార్వో తో బేరసారాలకు దిగాడు.
కథనాలు రాయకుండా ఉండేందుకు రూ 2 లక్షలు ఇవ్వాలని జర్నలిస్ట్ డిమాండ్ చేశాడు. దీంతో ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు తీసుకునేందుకు ఆఫీసుకు రావాలని ఎమ్మార్వో జర్నలిస్టును ఆహ్వానించారు. ఆఫీసుకు వచ్చిన జర్నలిస్టు ఎమ్మార్వో దగ్గర 30 వేలు తీసుకుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు.