Kishan Reddy Letter To CM Revanth: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy Letter To CM Revanth బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెట్, నేవేలీ లిగ్నయింట్ కార్పొరేషన్ ఇండియా లిమిడెట్.

Kishan Reddy Letter To CM Revanth: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇందన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖ రాశారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెట్, నేవేలీ లిగ్నయింట్ కార్పొరేషన్ ఇండియా లిమిడెట్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్ట్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయన్నారు కేంద్రమంత్రి. పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మనిర్భరతతో కూడిన భవిష్యత్ ను ఏర్పర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.