Rahul Gandhi: తెలంగాణ కులగణన పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi దేశంలో దళితుల చరిత్రను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది. ఎవరు రాశారు అని ప్రశ్నించారు.

Rahul Gandhi: తెలంగాణ కులగణన పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాన కులగణన దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తమ శక్తిని తాము తెలుసుకోకపోవడమే కొందరి సమస్య అని అన్నారు. దేశంలో దళితుల చరిత్రను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది. ఎవరు రాశారు అని ప్రశ్నించారు.
ఓబీసీల చరిత్ర రాయకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని ఆరోపించారు. ఓబీసీలు అన్ని రంగాల్లో వివక్ష ఎదర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఇండియాలో ఓబీసీలు ఎక్కడున్నారని రాహుల్ నిలదీశారు. అదానీ ఓసీసీనా మీడియారంగంలో ఓబీసీలకు స్థానం ఎక్కడుంది అని ప్రశ్నించారు. అభివృద్ధిలో విద్యదే కీలక పాత్రఅని, ఇంగ్లీష్ నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయని అన్నారు. ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తున్న వరాు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారని ప్రశ్నించారు.