Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్..
Rain Alert తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించించి.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించించి. రాష్ట్రం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం కురుస్తుందంటున్నారు. అలాగే ఏపీలో వర్షాలు పడతాయన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కుస్తాయని అధికారులు తెలిపారు.