Telangana RTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. తెలుగు వస్తే చాలు నెలకు 20 వేలకు పైగా జీతం

Telangana RTC :
ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి తెలంగాణ తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఎలాంటి విద్యార్హత లేకపోయినా కూడా తెలుగు వస్తే చాలు. కేవలం తెలుగు చదవడం, రాయడం వస్తే చాలు ఉద్యోగాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కేవలం పాఠశాల విద్య మాత్రమే చదివిన వారు, చదువు మధ్యలో ఆపేసిన వారికి ఇది మంచి అవకాశం. మొత్తం 1500 పోస్టులకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సర్క్యూలర్ కూడా జారీ చేసింది. అయితే తెలంగాణ ఆర్టీసీ ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో, ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటుంది. కేవలం తాత్కాలికంగా మాత్రమే వీరిని నియమించుకుంటోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిని నాలుగు నెలల పాటు తీసుకుంటుంది. ఆ తర్వాత కూడా వారి అవసరం ఉందంటే.. కాంట్రాక్ట్‌ను పొడిగిస్తారు. ప్రస్తుతం ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఆ తర్వాత కొందరు డ్రైవర్లు రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో భారీగా కొరత ఏర్పడింది. దీంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ భావిస్తోంది.
తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వయస్సు 60 ఏళ్లు కంటే తక్కువగా ఉండాలి. అలాగే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎత్తు కూడా 160 సెంటి మీటర్లు ఉండాలి. భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉండాలి. వీటితో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి చదువు అక్కర్లేదు. తెలుగులో మాట్లాడటం, రాయడం వస్తే చాలు. కనీసం పాఠశాల విద్య అయినా చదివి ఉండాలి. వీటితో పాటు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్డు ఉండాలి. దీనికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే వీటికి ఎలాంటి దరఖాస్తు లేకుండా నియామకాలు చేపడతారు. ఆర్టీసీ సీనియర్ ఉద్యోగులు ఈ నియామకం చేపడతారు. డ్రైవర్ల నైపుణ్యాన్ని తెలుసుకుని నియామకం చేపడతారు. అయితే ఈ వీటికి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. దాదాపుగా రెండు వారాల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో చేర్చుకుంటారు. అయితే ట్రైనింగ్ సమయంలో రోజుకి రూ.200 ఇస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు రూ.22,415 జీతం ఇస్తారు. పాఠశాల వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసి మధ్యలోనే ఆపేసిన వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో జాయిన్ అయినా కూడా చివరకు రెగ్యులర్ చేసే అవకాశాం కూడా ఉండవచ్చు. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం ఉత్తమం. సొంతూళ్లకు దగ్గరగా ఉండి హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు.