Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది.. అందుకే వాయిదా పడింది
Revanth Reddy: ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ కూడా నిర్వహించారు. దీని తర్వాత ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.

Revanth Reddy: ఎలాంటి సమస్యలను అయినా కూడా కూర్చోని పరిష్కరించుకుంటే.. క్లియర్ అవుతుందని చెప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిదర్శనం. ఆర్టీసీ సమ్మె నేటి నుంచి జరగాల్సి ఉండగా.. రేవంత్ రెడ్డి కూర్చోని మాట్లాడి పరిష్కరించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ కూడా నిర్వహించారు. దీని తర్వాత ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాట్లాడుతున్నారని, దానికి కొంత సమయం కావాలని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కార్మిక సంఘాల డిమాండ్‌లను తొందరలోనే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నారని రేవంత్ సర్కార్ చెప్పడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రకటించారు.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరే ఎందుకు?
ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్, ఇంకా కొన్ని ప్రయోజనాలను ఇవ్వాలని కార్మిక సంఘాలు కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపాయి. కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈ క్రమంలో తమ డిమాండ్‌లను ఎలాగైనా పరిష్కరించుకోవాలని కార్మిక సంఘాలు మంగళవారం రాత్రి నుంచి సమ్మె చేపడుతున్నట్లు ముందుగానే తెలిపింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాయి. అయితే దీంతో ఆర్టీసీ యాజమాన్యం, రేవంత్ సర్కార్ ఈ సమస్యను పరిష్కరించారు. కార్మిక సంఘాల డిమాండ్‌లను వెంటనే తీరుస్తామని వాటి కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ సర్కార్ తెలిపింది.
Also Read: Operation Sindoor: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. 90 మంది ఉగ్రవాదులు హతం
ఈ సమస్యను పరిష్కరించుకుందామని, దీనికోసం మళ్లీ చర్చలు జరుపుదామని తెలిపారు. దీంతో మంత్రి పొన్నంతో కార్మిక సంఘాల ప్రతినిధులు మంగళవారం మధ్యాహ్నం చర్చలు జరిపారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెడతామని ఈ చర్చల్లో పొన్నం చెప్పడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను వాయిదా వేశాయి. రేవంత్ సర్కార్ దీంతో పాటు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే. అయితే సీనియర్ ఐఏఎస్‌లు అయిన లోకేశ్ కుమార్, నవీన్ మిట్టల్, కృష్ణ సాగర్ వీటిపై చర్చలు జరపాలి. వెంటనే ఓ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణమే. రేవంత్ రెడ్డి ఈ సమస్యలోకి ఎంటర్ కావడం వల్ల పరిష్కారం అయ్యిందని కొందరు అంటున్నారు.
-
Conductor Jobs Recruitment 2025: పదో తరగతి చదివితే చాలు.. కండక్టర్ ఉద్యోగం మీకే
-
Jobs: త్వరలోనే 27 వేల ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్స్
-
Telangana : నువ్వు ఉచితాలు ఇవ్వకుంటే.. ఉద్యోగాలు వచ్చేవి.. రేవంత్ పై మాజీ ఉద్యోగి ఫైర్..
-
KTR: రేవంత్ దూకే గోడలు కేటీఆర్ కు ఎలా తెలుసు.. పోలీసులు లీకులు ఇస్తున్నారా?
-
Telangana RTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. తెలుగు వస్తే చాలు నెలకు 20 వేలకు పైగా జీతం