Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరే ఎందుకు?
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ఓ కారణం. ఉంది. ఇండియాను భరతమాతతో పోలుస్తారు. అలాంటి భరత మాతకు తల అయిన కాశ్మీర్‌పై దాడి చేశారు. ఎలాగైనా కూడా ప్రతీకార దాడి తీర్చుకోవాలని ఉద్దేశంతో భారత సైన్యం ప్లాన్ చేసింది.

Operation Sindoor: జమ్మూకశ్మీర్(Jammu Kashmir) పహల్గంలో ఏప్రిల్ 22వ తేదీన దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. ఈ ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌కు సపోర్ట్‌గా నిలిచాయి. అయితే భారత్ పాక్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఆఖరికి సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత అన్ని ఎగుమతులు కూడా ఆపేసింది. ఈ ఉగ్రదాడికి ఎలాగైన ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ తెలిపంది. చెప్పినట్లుగానే అందరూ నిద్రపోతున్న సమయంలో భారత్ పాక్‌పై ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు చేసింది. సరిహద్దు నుంచి 200 కి.మీ వరకు ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయగా.. ఇప్పటి వరకు 90 మంది మృతి చెందారు. అయితే ఈ ప్రతీకార దాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అసలు ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు మీకు తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
Also Read: Aadhaar card: ఆధార్ కార్డు విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తే.. జైలు శిక్ష తప్పదు
ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ఓ కారణం. ఉంది. ఇండియాను భరతమాతతో పోలుస్తారు. అలాంటి భరత మాతకు తల అయిన కాశ్మీర్‌పై దాడి చేశారు. ఎలాగైనా కూడా ప్రతీకార దాడి తీర్చుకోవాలని ఉద్దేశంతో భారత సైన్యం ప్లాన్ చేసింది. భారత మాతకు నుదుటి తిలకంగా ఉన్న కాశ్మీర్‌పై దాడి చేశారు. నుదుటి తిలకాన్ని సింధూరంగా పోల్చుతారు. భారతీయులకు సింధూరం చాలా ముఖ్యమైనది. ఈ సింధూరానికి గుర్తుగా భారత్ దాడికి పాల్పడింది. అలాగే పహల్గాం ఉగ్రదాడిలో మహిళలు వారి భర్తలను కోల్పోయారు. సింధూరం అనేది మహిళలకు చాలా ముఖ్యమైనది. ఈ ఉగ్రదాడిలో సింధూరం కోల్పోయిన మహిళల భర్తల ఆత్మలకు శాంతి జరగాలనే ఉద్దేశంతో దీనికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టరు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి దాడి చేయడంతో.. మహిళ పసుపు, కుంకుమలకు గుర్తుగా ఈ పేరు పెట్టారు. అలాగే దీనికి ఇంకో కారణం కూడా ఉంది. హిందువుల్లో ఎవరైనా చనిపోతే దాదాపుగా 14 రోజుల తర్వాత పెద్ద కర్మ నిర్వహిస్తారు. అయితే ఈ ఆచారాన్ని ప్రభుత్వం కూడా పాటించింది. దాడి జరిగిన 14 రోజుల తర్వాత పాకిస్థాన్‌పై భారత్ దాడులకు పాల్పడిందని, ఇలా ప్రతీకారం తీర్చుకుందని అంటున్నారు. ఏది ఏమైనా భారత్ చివరకు ప్రతీకారం తీర్చుకుందని చెప్పవచ్చు.
Also Read: Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు
ఇదెలా ఉండగా ఏప్రిల్ 22 వ తేదీన పహల్గాంలో టూరిస్ట్‌లను టార్గెట్ చేసి ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఈ ఉగ్రదాడుల్లో కొందరు మహిళలు వారి భర్తలను కోల్పోయారు. పెళ్లి అయి వారం కాకముందే నేవీ అధికారి మృతి చెందాడు. సరదాగా హనీమూన్‌కి వెళ్లి ఉగ్రవాదులకు బలి అయ్యాడు. పెళ్లి అయిన వారం రోజులకే భర్త చనిపోవడం అందరినీ కూడా కంటతడిపెట్టింది. ఈ సంఘటన యావత్తు భారత్‌ను కలచి వేసింది. దీంతో మోదీ ప్రభుత్వం పాక్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?