Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు
Riyan Parag రియాన్ పరాగ్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో సరికొత్త రికార్డును ఐపీఎల్ చరిత్రలో సృష్టించాడు. అయితే ఐపీఎల్లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అందులో క్రిస్ గేల్ టాప్‌లో ఉండగా.. రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకు సింగ్, రియాన్ పరాగ్ ఉన్నారు.

Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా.. ఆదివారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలవకపోయినా కూడా ఫ్యాన్స్ మనస్సులు గెలుచుకుంటుంది. అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టిన మొదటి ప్లేయర్‌గా చరిత్ర కెక్కాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచింది. కానీ రియాన్ పరాగ్ మాతం సిక్స్‌ల వర్షం కురిపించి చరిత్ర సృష్టించాడు. అలీ 13 ఓవర్లో బౌలింగ్ వేయడానికి రావడంతో.. ఫస్ట్ బాల్‌కు రియాన్ పరాగ్ స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా చెలరేగిపోయాడు. ఒక ఓవర్లో వరుసగా రియాన్ పరాగన్ సిక్స్‌లు కొట్టాడు. ఒక బాల్ వేయగా.. మిగతా ఐదు బాల్స్‌కి సిక్సులు కొట్టాడు. మొత్తం మొయిన్ అలీ ఒక ఓవర్లో 32 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కూడా మొదటి బాల్కి సిక్స్ కొట్టాడు. రియాన్ పరాగ్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడంతో సరికొత్త రికార్డును ఐపీఎల్ చరిత్రలో సృష్టించాడు. అయితే ఐపీఎల్లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు బాదిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అందులో క్రిస్ గేల్ టాప్‌లో ఉండగా.. రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకు సింగ్, రియాన్ పరాగ్ ఉన్నారు.
ఈ మ్యా్చ్ ఓడిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో నెటిజన్లు మీరు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోయారని.. కానీ మా మనస్సులు గెలిచారని అంటున్నారు. మ్యాచ్ ఓపెనర్లు బాగానే ఆడినా కూడా ఫినిషింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఓడిపోతున్నారు. కేవలం ఒక్క పరుగుతోనే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడిపోయింది. ఇలా ఒక్క పరుగులోనే ఓడిపోతే ఆ బాధ వర్ణణాణీతం. ఇదిలా ఉండగా కేకేఆర్ ఈ విజయంతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆరో స్థానానికి చేరింది. అయితే ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌లు కూడా కేకేఆర్ గెలవాలి. అప్పుడే ఫ్లేఆఫ్స్‌కు చేరుకోగలదు. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?