Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఎక్కడో తెలుసా?
Asia Cup 2025 India Vs Pakistan రెండు జట్టు ఫైనల్స్ కు చేరుకుంటే, ఈ టోర్నమెంట్ లో వారు మూడోసారి తలపడే అవకాశం ఉంది.

Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై క్లారిటీ వచ్చింది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగునుంది. అయితే ఈ మ్యాచ్ లు దుబాయ్, అబుదాబిలలో జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ లో జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్టు ఖచ్చితంగా తలపడతాయి. రెండు జట్టు సూపర్ 4 దశకు అర్హత సాధిస్తే, సెప్టెంబర్ 21న రెండో పోరు జరిగే అవకాశం ఉంది.
రెండు జట్టు ఫైనల్స్ కు చేరుకుంటే, ఈ టోర్నమెంట్ లో వారు మూడోసారి తలపడే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. గ్రూప్ స్టేజ్ లో ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నెషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ గ్రూప్ ఏ లో ఉన్నాయి. ఈ గ్రూప్ లో యూఏఈ, ఒమన్ కూడా ఉన్నాయి. మరోవైపు గ్రూప్ బీ లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి.
-
Asia Cup 2025: ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Asia Cup 2025 : మరో క్రికెట్ సమరానికి ముహూర్తం ఫిక్స్.. క్రికెట్ అభిమానులకు పండుగే
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?