Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌తో కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి భారత్ వైమానిక దాడులకు పాల్పడింది. మొత్తం తొమ్మిది ప్రధాన స్థావరాలపై భారత్ దాడి చేసింది.

Operation Sindoor: పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌తో కేవలం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి భారత్ వైమానిక దాడులకు పాల్పడింది. మొత్తం తొమ్మిది ప్రధాన స్థావరాలపై భారత్ దాడి చేసింది. అయితే పాకిస్థాన్‌లో ఇవే ఉన్నాయా అంటే కాదు. ఇంకా ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలు ఉన్నాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మొత్తం 21 ప్రసిద్ధ ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. గత మూడు దశాబ్దాల నుంచి పాక్ ఈ ఉగ్రవాద స్థావరాలను నడిపిస్తోంది. 21 ప్రసిద్ధి శిక్షణ శిబిరాల్లో రెక్రూట్‌మెంట్, బోధనా కేంద్రాలు, రిఫ్రెషర్ కోర్సులు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
పాక్, పీఓకేలో సవాయ్ నాలా, సయ్యద్ నా బిలాల్, మష్కర్ ఈ అక్సా, చేలాబంది, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయి, గర్హి హబీబుల్లా, బట్రాసి, బాలాకోట్, ఓఘి, బోయి, సెన్సా, గుల్పూర్, కోట్లి, బరాలీ, దంఘీ, బర్నాలా, మెహమూనా జోయా, సర్జల్, ముషిద్కే, బహవల్ పూర్ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అయితే భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ నాశనం చేసింది. మర్కజ్ సువానల్లా, బహవల్పూర్‌లో ఒకటి ఉంది. మురిద్కేలో మర్కజ్ తయ్యబా, టెహ్రాకలాన్‌లో సర్జల్, సియాల్‌కోట్‌లో మహమూనా జోయా సువిధా, భింబర్‌లో మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, కోట్లీలో మర్కజ్ అబ్బాస్, కోట్లీలో మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లో షావాయి నాలా క్యాంప్, ముజఫరాబాద్‌లో సయ్యద్నా బిలాల్ స్థావరాలపై భారత్ విరుచుకుపడింది.
Read Also: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్‌ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి