Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?
పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కూడా హతం అయినట్లు సమాచారం.

OPERATION SINDOOR: పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. అయితే వీరిలో జైషే చీఫ్ మసూద్ అజార్ కూడా హతం అయినట్లు సమాచారం. అజార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే పహల్గాం ఉగ్రదాడిలో మసూద్ అజార్ పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఇంతకీ ఎవరీ ఈ జైషే చీఫ్ మసూద్ అజార్? ఇతని స్టోరీ ఏంటి? పహల్గాం దాడులు కాకుండా ఇంకా ఏవైనా చేశారా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ను మౌలానా మసూద్ అజార్ స్థాపించాడు. అయితే మసూద్‌ను కేవలం భారత్ మాత్రమే కాదు.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ప్రస్తుతం మసూద్ అజార్ వయస్సు 56 ఏళ్లు. అయితే అజార్ పాకిస్థాన్‌లోనే ఉంటూ.. భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిలోనే కాకుండా.. గతంలో కూడా దాడులు చేశాడు. అయితే మసూద్ అజార్ భారత్ జైలులో ఉండేవాడు. మసూద్‌ను విడిపించడానికి పాక్ ఇండియన్ విమానాన్ని ఏకంగా హైజాక్ చేసింది. మసూద్ అజార్‌ను వదిలిపెట్టడంతో.. భారత్‌పై అనేక ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పఠాన్‌కోట్, పుల్వామా, పార్లమెంట్ అటాక్ వంటి పెద్ద పెద్ద దాడుల వెనుక ఈ మసూద్ అజార్ ప్రధాన సూత్రధారి. 2005లో అయోధ్యలోని రామ జన్మభూమిపై, 2019లో పుల్వామాలో CRPF సైనికులపై కూడా దాడి చేశాడు. ఆఖరికి 2016లో ఉరి దాడికి, ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని భారత కాన్సులేట్‌పై దాడికి కూడా మసూద్ బాధ్యత వహించాడు.
Read Also: పాక్‌లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?
మసూద్ అజార్ భారత్‌లోకి తొలిసారిగా 1994 జనవరి 29న ప్రవేశించాడు. బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి శ్రీనగర్‌లోకి వెళ్లాడు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అనంతనాగ్‌లో మసూద్‌ను అరెస్టు చేశారు. నాలుగేళ్ల తర్వాత 1995లో జమ్మూ కాశ్మీర్‌కు వచ్చిన ఆరుగురు విదేశీ పర్యాటకులు కిడ్నాప్ అయ్యారు. మసూద్ అజార్‌ను విడుదల చేస్తేనే పర్యాటకులను విడుదల చేస్తామన్నారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఇద్దరు తప్పించుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారి గురించి ఎలాంటి సమాచారం రాలేదు. 1999 డిసెంబర్ 24న ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న భారతీయ విమానాన్ని అజార్ సోదరుడు, ఇతర ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అతను దానిని ఆ సమయంలో తాలిబన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లాడు. విమానంలో ఉన్నవారిని విడిచి పెట్టాలంటే మసూద్ అజార్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయాలనే డిమాండ్ చేశారు. దీంతో మసూద్ భారత్ జైలు నుంచి విడుదల అయ్యాడు.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?