Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
పాకిస్థాన్, పాక్ అక్రమిత కాశ్మీర్‌పై భారత్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ వైమానిక దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం.

Operation Sindoor: పాకిస్థాన్, పాక్ అక్రమిత కాశ్మీర్‌పై భారత్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ వైమానిక దాడుల్లో 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. అయితే భారత్ ఇలాంటి ప్రతీకార దాడులు చేపట్టడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ కూడా ఇలాంటి ప్రతీకార దాడులు చేపట్టింది. మరి ఎప్పటి నుంచి భారత్ ఇలాంటి ప్రతీకార దాడులు చేసిందో ఈ స్టోరీలో చూద్దాం.
ఆపరేషన్ బందర్
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ 2019లో ఉగ్రదాడికి పాల్పడింది. ఈ పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా భారత్ 13 రోజుల తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆపరేషన్ బందర్ పేరుతో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. అయితే భారత్ సరిహద్దులు దాటి వైమానిక దాడులు చేయడం1971 తర్వాత ఇదే మొదటిసారి.
యూరి సర్జికల్ స్ట్రైక్స్
బారాముల్లా జిల్లాలోని యూరి ఆర్మీ బేస్‌పై 2016లో జైషే ఉగ్రవాదులు దాడిలు జరపగా..19 మంది సైనికులు మృతి చెందారు. దీంతో భారత్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ దాటి మరి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీనికి యూరి సర్జికల్ స్ట్రైక్స్ అని పేరు పెట్టింది. అయితే ఈ ఆపరేషన్‌లో భారత సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Read Also: భారత్ మెరుపు దాడి నిర్వహించిన మిస్సైల్స్ ఏంటో మీకు తెలుసా?
ఆపరేషన్ విజయ్
కార్గిల్ యుద్ధం 1999లో జరిగింది. ఈ సమయంలో పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ నిర్వహించింది. అలాగే భారత వైమానిక దళం కూడా ఆపరేషన్ సఫేద్ సాగర్ నిర్వహించి పాక్ సైనికులను తరిమికొట్టింది.
ఆపరేషన్ మేఘదూత్
సియాచిన్ గ్లేసియర్‌పై నియంత్రణ కోసం భారత్ 1984లో ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. పాకిస్థాన్ ఆపరేషన్ అబాబీల్‌కు ప్రతీకారంగా భారత దళాలు వ్యూహాత్మక శిఖరాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికీ అక్కడ భారత్ సైనిక ఉనికిని కొనసాగిస్తోంది.
Read Also: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్‌కి ఆటంకమా!
ఆపరేషన్ కాక్టస్ లిల్లీ
భారత దళాలు మేఘనా నదిని దాటి ఢాకాను చుట్టుముట్టడంలో 1971లో ఆపరేషన్ కాక్టస్ లిల్లీ చేపట్టింది. మొదటిసారిగా యాంటీ-షిప్ మిస్సైళ్లను ఉపయోగించి కరాచీ పోర్టులోని పాక్ నౌకలను, ఇంధన నిల్వలను ధ్వంసం చేశారు.
ఆపరేషన్ రిడిల్
పాకిస్థాన్ నియంత్రణ రేఖ దాటినప్పుడు, భారత సైన్యం ఆపరేషన్ రిడిల్ పేరుతో 1965లో లాహోర్, కసూర్‌పై దాడులు చేసింది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?