Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Telangana News »
  • Rajiv Yuva Vikasam Scheme Reason For The Delay

Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం పథకం ఆలస్యం కావడానికి కారణమిదే?

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 2 వ తేదీ నుంచి రుణ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం పథకం ఆలస్యం కావడానికి కారణమిదే?
  • Edited By: kusuma,
  • Updated on June 2, 2025 / 12:05 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 2 వ తేదీ నుంచి రుణ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అది ఆలస్యమవుతుందని అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరగనుంది. ఇందులో కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ భేటీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సన్నద్ధతతో పాటు రాజీవ్ యువ వికాసం పథకంపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకానికి అంచనాలకు మించిన దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇందులో అర్హులు ఏవరో, అనర్హులు ఎవరో కూడా సరిగ్గా తెలియదు. దీనివల్ల దీన్ని మరింత ఆలస్యం చేస్తున్నారు.

Read Also: 40ల్లో కూడా 20లా కనిపించాలంటే.. ఫాలో దీజ్ రూల్స్

తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5న జరగనున్నది. అయితే ఈ పథకం అమలు చేయడానికి చాలా కీలకంగా ఉంది. ఈ సమావేశంలో ఈ పథకంతో పాటు మరికొన్నింటి వాటిపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల మంత్రులు తమ జిల్లాల్లో పర్యటనలు చేశారు. వీటిలో నాలుగు కీలక అంశాలపై అధికారులతో సమీక్షలు జరిపారు. వీటి నివేదికలను సీఎం సమక్షంలో ఇవ్వనున్నారు. అలాగే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హతా ప్రమాణాలు అన్నింటి కూడా పరిశీలించి తుది జాబితాను విడుదల చేయనున్నారు. అయితే గతంలో ఈ పథకాల అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని నివారించేందుకు పారదర్శక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హుల తుది జాబితా ఫిక్స్ అయిన తర్వాత రుణ మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ జూన్ 9 వరకు జరగనుంది. యువత ఎంచుకున్న రంగాల్లో వారికి నైపుణ్యాలు పెంపొందించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.

Read Also: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్

జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింద రూ.50 వేల వరకు 100% రాయితీతో, రూ.1 లక్ష వరకు 90%, రూ.2 లక్షల వరకు 80%, రూ.4 లక్షల వరకు 70% రాయితీతో రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ పథకం ద్వారా స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీనివల్ల రాష్ట్ర యువత ఆర్థికంగా ఎదగుతుందనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రికి అందించగా, ఆ వివరాలపై మంత్రులకు సమగ్రంగా వివరించారు. ఈ నివేదిక ఆధారంగా కేబినెట్‌లో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అంతేకాదు, ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు.

Tag

  • Delay
  • Educational News
  • Rajiv Yuva Vikasam Scheme
  • Telangana News
Related News
  • CM Revanth Reddy health Tips: బట్టలు ఉతుక్కోండి.. జొన్న రొట్టె తినండి.. సీఎం ఆరోగ్య సూత్రాలు!

  • Jobs: త్వరలోనే 27 వేల ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్స్

  • Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది.. అందుకే వాయిదా పడింది

  • Telangana :  నువ్వు ఉచితాలు ఇవ్వకుంటే.. ఉద్యోగాలు వచ్చేవి.. రేవంత్ పై మాజీ ఉద్యోగి ఫైర్..

  • Loan: ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా.. ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోండి

Latest Photo Gallery
  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us