Jobs: త్వరలోనే 27 వేల ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్స్
ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతీ ఒక్కరి కల. ఈ ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడతారు. నిద్ర, తిండి లేని రాత్రులు గడుపుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంత ఈజీగా కూడా రాదు. ఎన్నో ఇష్టాలను వదిలి చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలరు.

Jobs: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతీ ఒక్కరి కల. ఈ ఉద్యోగాల కోసం చాలా మంది ఎంతో కష్టపడతారు. నిద్ర, తిండి లేని రాత్రులు గడుపుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అంత ఈజీగా కూడా రాదు. ఎన్నో ఇష్టాలను వదిలి చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలరు. లేకపోతే ఈ ఉద్యోగం రావడం చాలా కష్టం. అయితే చాలా మంది నిద్ర మానుకుని రేయి, పగలు ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్లు కోసం అయితే తెగ ప్రయత్నిస్తుంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే చదువుదామని ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలను అందించాలని భావిస్తోంది.
Read Also: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
ఈ క్రమంలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 27 పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 14 వేల ఉద్యోగాలు, ఇంజినీర్ల 2 వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 లో 1000 ఉద్యోగాలు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 7 వేల జీపీవో పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ 3, 4 సిలబస్ ఒకటే. అయితే ఈ రెండిటికి కూడా క్వాలిఫికేషన్ పరీక్షను ఒకేసారి నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. అయితే గ్రూప్ 3 లో రిక్రూట్ అయ్యే వాళ్లు హెచ్‌వోడీ కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు. గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యే వాళ్లంతా కూడా జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు.ఒకటే పరీక్ష నిర్వహించి వేరే పోస్టింగ్ వేస్తారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి అయ్యింది. దీంతో కొలువుల భర్తీపై సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి జాబ్ క్యాలెండర్ ఏప్రిల్‌లోనే రావాలి. కానీ రాలేదు. మేలో గ్రూప్ -2 నోటిఫికేషన్ రావాల్సి ఉండగా.. జులైలో గ్రూప్3 నోటిఫికేషన్ రావాలి. కానీ ఏది జరగలేదు. ఇక ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను షెడ్యూల్ చేశారు. కానీ.. ఎస్సీవర్గీకరణ కోసం ఆ నోటిఫికేషన్ ను నిలిపివేశారు. వీటితో పాటు గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు అన్ని కూడా ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి అయింది. ఈ క్రమంలోనే అన్ని నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తుంది.
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్‌బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక