Operation Sindoor: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. 90 మంది ఉగ్రవాదులు హతం
Operation Sindoor: ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది.

Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో జరిగిన ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందారు. సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో గడుపుదామని వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ పాక్‌పై వైమానిక దాడులు చేసింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఈ వైమానిక దాడులను చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ఈ దాడుల్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసింది. ప్రతీకారంగా అర్థ రాత్రి సమయంలో దాడి చేసింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగేలా భారత్ ఈ వైమానిక దాడికి పాల్పడింది. ఉగ్రవాదాలకు సంబంధించిన తొమ్మిది స్థావరాలను భారత్ నాశనం చేసింది. ముఖ్యంగా బహవల్పూర్ను టార్గెట్ చేసి మెరుపు దాడులు నిర్వహించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌కు చెందిన హెడ్ క్వార్టర్, జైషే మహమ్మద్‌కు చెందిన మదర్సాలే స్థావరాలను భారత్ ఆర్మీ నాశనం చేసింది. పహల్గాం దాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పేరే ఎందుకు?
ఇదిలా ఉండగా ఏప్రిల్ 22 వ తేదీన పహల్గాంలో టూరిస్ట్‌లను టార్గెట్ చేసి ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు. కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఈ ఉగ్రదాడుల్లో కొందరు మహిళలు వారి భర్తలను కోల్పోయారు. పెళ్లి అయి వారం కాకముందే నేవీ అధికారి మృతి చెందాడు. సరదాగా హనీమూన్‌కి వెళ్లి ఉగ్రవాదులకు బలి అయ్యాడు. పెళ్లి అయిన వారం రోజులకే భర్త చనిపోవడం అందరినీ కూడా కంటతడిపెట్టింది. ఈ సంఘటన యావత్తు భారత్‌ను కలచి వేసింది. దీంతో మోదీ ప్రభుత్వం పాక్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసి వారి స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 90 వరకు ఉగ్రవాదులు చనిపోయారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌తో సంబంధాలను తెంచుకుంది. ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాటు పాక్ పౌరులు దేశంలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే సింధూ నదీ జలాల నీటిని కూడా ఆపేసింది. దీంతో పాక్‌లో ఇప్పటికే గడ్డు పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాక్‌కు భారత్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
-
Dry Coconut: ఎండు కొబ్బరితో ఆరోగ్యం.. చిన్న ముక్క తింటే చాలు
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?