Cow Dung: అరబ్ దేశాలకు మన ఆవుల పేడతో ఏం పని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయంటే..
Cow Dung భూమిలో సారం ఉంటేనే పంట పండుతుంది. భూమికి సారం రావాలంటే అందులో ఉన్న మృతికలో ఖనిజలవణాలు, పోషకాలు అధికంగా ఉండాలి. అవన్నీ ఏర్పడాలంటే నేల మీద వానపాములు సంచరించాలి.

Cow Dung: వానపాములు సంచరించడానికి పేడ కావాలి. ఆ పేడ కూలిపోయినప్పుడు ఏర్పడే మృతికలో వానపాములు సంచరిస్తుంటాయి. ఆ వానపాముల వల్లే భూమి సారాన్ని పొందుతుంది. అలాంటి భూమిలో పంటలు వేసినప్పుడు దిగుబడి భారీగా వస్తుంది. కాకపోతే ఇప్పటి కాలంలో రసాయనిక ఎరువులు వాడకం అధికంగా అవడం వల్ల వానపాములు అంతగా కనిపించడం లేదు.. అయితే ఇప్పుడిప్పుడే చాలా వరకు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మరలు తున్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇక మన దేశంలో ఒకప్పటితో పోల్చితే పశు సంపద తగ్గిపోయినప్పటికీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ వ్యవసాయం పశువుల ద్వారానే సాగుతోంది. చాలామంది పశువులను పాల ఉత్పత్తి కోసం పెంచుకుంటున్నారు. పాల ఉత్పత్తి తో పాటు.. వాటి మయం ద్వారా భూములను సారవంతం చేసుకుంటున్నారు. తద్వారా అధిక దిగుబడులు సాధించడానికి అడుగులు వేస్తున్నారు..
400 కోట్లు
సాధారణంగా మన దేశంలో ఎడారి పంట అయినటువంటి ఖర్జూరాలు పండవు. మన దేశ అవసరాల కోసం అరబ్ దేశాల నుంచి ఖర్జూర పండ్లను దిగుమతి చేసుకుంటాం. కాకపోతే ఇప్పటి కాలంలో కొంతమంది ఔత్సాహిక రైతులు మన దేశంలో ఖర్జూర పంటను సాగు చేస్తున్నారు. ఖర్జూర అనేది ఎలాంటి వాతావరణం లోనైనా పండుతుంది. ఎందుకంటే ఇది సహజంగానే ఎడారి మొక్క. ఇది నీటిని తక్కువగా పీల్చుకుంటుంది. ఇకపోతే భూమిలో సారము గనుక మెరుగ్గా ఉంటే అధికంగా ఫల సహాయాన్ని అందిస్తుంది. అయితే ఖర్జూర మొక్కలను అరబ్ దేశాలలో విరివిగా పెంచుకుంటారు. లక్షలు ఎకరాలలో ఖర్జూర తోటలు సాగు చేస్తుంటారు. ఇరాన్, ఇరాక్, ఇతర అరబ్ దేశాలలో ఖర్జూర విపరీతంగా పండుతుంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఖర్జూర పండ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసి భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న అరబ్ దేశాలు.. ఇప్పుడు మన దేశం నుంచి ప్రతి ఏడాది 400 కోట్ల ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయి. ఖర్జూర చెట్లు నేలలో సారం అధికంగా ఉంటే విపరీతంగా కాయలు కాస్తుంటాయి. ఆ కాయలు అత్యంత రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా నాణ్యమైన ఖర్జూర పండ్లను ఉత్పత్తి చేయాలంటే కచ్చితంగా నెలలో సారం ఉండాలి. ఇక అరబ్ దేశాలలో ఆవులు అంతగా ఉండవు అక్కడ ఒంటెలు ఉన్నప్పటికీ.. వాటి ఎరువు అక్కడి అవసరాలకు సరిపోదు. అందువల్లే మన దేశం నుంచి గోవుల పేడను ప్రతి ఏడాది అరబ్ దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ప్రతి ఏడాది 400 కోట్ల దాకా ఆవు పేడను దిగుమతి చేసుకొని.. ఖర్జూర చెట్లకు ఎరువుగా వేస్తుంటాయి. అలా ఉత్పత్తి అయిన పండ్లను ఇతర దేశాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటాయి.