Cow dung: ఆవు పేడతో కోట్లలో బిజినెస్.. విదేశాల్లో ఎందుకింత డిమాండ్
దేశంలో గోవులను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో గోవులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ప్రతీ ఆలయంలో కూడా గోశాల ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులులా ఆవులను గౌరవిస్తారు. కేవలం ఆవులను మాత్రమే కాకుండా పేడ, మూత్రానికి కూడా విలువ ఇస్తారు.

Cow dung: దేశంలో గోవులను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. హిందూ సంప్రదాయంలో గోవులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ప్రతీ ఆలయంలో కూడా గోశాల ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులులా ఆవులను గౌరవిస్తారు. కేవలం ఆవులను మాత్రమే కాకుండా పేడ, మూత్రానికి కూడా విలువ ఇస్తారు. అయితే ఆవు పేడతో ఇంటిని అలుకుతారు. పూజలకు ఉపయోగిస్తారు. వీటిలోని ఔషధ గుణాలు ఎలాంటి చెడు, పురుగులు, ఇన్ఫెక్షన్ ఇంటికి రాకుండా చేస్తాయి. దేశంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పూజలు సమయాల్లో అయితే ఉపయోగిస్తారు. పూర్వ కాలంలో పేడ వాడకం ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం దీని వాడకం బాగా తగ్గిపోయింది. దేశంలో పేడ వాడకం బాగా తగ్గినా కూడా విదేశాల్లో మాత్రం బాగా డిమాండ్ పెరిగింది. ఈ పేడను దేశం నుంచి చాలా దేశాలు ఎగుమతి కూడా చేసుకుంటుంది. ఈ పేడతో విపరీతమైన బిజినెస్‌లు చేస్తుంది. మరి మన దేశంలో కాకుండా ఏయే దేశాల్లో వీటికి డిమాండ్ బాగా పెరిగింది? ఎందుకు వీటిని ఎగుమతి చేసుకుంటుందో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
Read Also: గోల్డెన్ ఏటీఎం.. బంగారం వేస్తే అకౌంట్‌లోకి డబ్బులు
దేశంలో గోమయ ఉత్పత్తులకు కాస్త తక్కువ డిమాండ్ ఉంది. కానీ విదేశాల్లో మాత్రం వీటికి మంచి గిరాకీ పలుకుతోంది. గతేడాది దాదాపుగా రూ.400 కోట్లు గోమయం దేశం నుంచి ఎగుమతి అయ్యింది. అయితే ఎక్కువగా కువైట్, అరబ్ దేశాలు భారత్ గోమయాన్ని కొంటున్నాయి. అయితే గోమయాన్ని పొడిగా చేస్తే ఖర్చూరాల పంటకి దిగుబడి వస్తుంది. దీంతో దేశం నుంచి ఎక్కువ మొత్తంలో గోమయాన్ని ఈ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. పేడను కంపోస్ట్‌గా చేసి వాటిని ఎరువుగా వేస్తారు. ఇందులోని పోషకాల వల్ల ఖర్జూరం బాగా పండుతుంది. దీంతో వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ కారణం వల్లనే ఆ దేశాలు పేడను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. కేవలం అరబ్ స్టేట్స్ మాత్రమే కాకుండా మాల్దీవులు, వియత్నాం, సింగపూర్ దేశాలకు కూడా గోమయాన్ని భారత దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. గోమూత్రంలో కూడా పోషకాలు ఉన్నాయి. వీటివల్ల పంటలకు బాగా ఉపయోగపడతాయి. సేంద్రీయ వ్యవసాయం, కీటక నాశనాలుగా వినియోగిస్తున్నారు. అయితే దేశంతో గోమయం కిలోను రూ.30 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. వీటివల్ల బాగా ఆదాయం వస్తోంది. అయితే ఇండియాలో దాదాపుగా 30 కోట్ల వరకు గోవులు ఉన్నాయి. వీటి ద్వారా ఎలా చూసుకున్నా కూడా రోజుకి 30 లక్షల టన్నుల గోమయం లభిస్తుంది.
ఈ గోమయం బిజినెస్‌ను ఇండియాలో పెట్టుకుంటే లాభాలు వస్తాయి. విదేశాల్లో వీటికి బాగా డిమాండ్ పెరిగింది. దీంతో కోట్లలో బిజినెస్ అవుతుంది. వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ బిజినెస్ అని చెప్పవచ్చు. తక్కువలో ఈ వ్యాపారం ప్రారంభించినా కూడా కోట్లలో లాభాలు వస్తాయి. మన దేశంలో వీటికి ఎలాంటి డిమాండ్ లేదని కొందరు వదిలేస్తారు. ఈ వ్యాపారం అనుకో మీకు తక్కువలో తేలిపోతుంది. తప్పకుండా ఈ వ్యాపారాన్ని ప్రారంభించి చూడండి. కోట్లలో లాభాలు వస్తాయి.
-
Gautam Gambhir: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
-
Cancellation: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
-
Cow Dung: అరబ్ దేశాలకు మన ఆవుల పేడతో ఏం పని.. ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయంటే..
-
Beautiful countries: తక్కువ బడ్జెట్‌లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్