Cancellation: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
జమ్మూకశ్మీ్ర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. దీంతో ఇండియా పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భావించింది.

Cancellation: జమ్మూకశ్మీ్ర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. దీంతో ఇండియా పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భావించింది. ఈ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎన్నో దశాబ్దాల కిందటి ఒప్పందం రద్దు చేయడంతో పాక్‌పై ఎలా ఎఫెక్ట్ పడనుంది? ఈ నదీ జలాల నీరు పాక్ ఏయే అవసరాలకు వాడుతుంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అప్పటి ప్రధాని సమయంలో..
Read Also: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. చైనాలో పుట్టిన సింధూ నది భారత్ నుంచి ప్రవహించి.. పాకిస్థాన్ చేరుతుంది. అయితే పాకిస్థాన్ వ్యవసాయం, గృహ అవసరాలకు ఈ సింధూ నది జలాలను ఉపయోగిస్తుంది. అయితే ఈ రెండు దేశాల నుంచి సింధూ నది ప్రవహించడంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చారు. అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు 1960లో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఒప్పందానికి మధ్యవర్తిత్వంగా ప్రపంచ బ్యాంకు ఉండేంది. అయితే ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వల్ల భారత్, పాక్ మధ్య ఈ నదీ జలాల సమస్య కాస్త తగ్గిందని చెప్పవచ్చు.
ఆరు దశాబ్దాల కిందట..
ఈ ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కు ఉంటుంది. ఇక పశ్చిమం వైపు ఉన్న సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు హక్కు ఉంటుందని కుదిరింది. అలాగే నీటి పరిమాణంపై కూడా ఒప్పందం కుదిరింది. అయితే తూర్పున ఉన్న నదుల సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు కాగా.. పశ్చిమాన ఉన్న జీలం, చీనాబ్ సామర్థ్యం 135 ఎమ్‌ఏఎఫ్‌గా ఉంది. ఇలా ఆరు దశాబ్దాల కింద ఈ సింధూ జలాల నీటిని పంచుకున్నారు. ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్యసమితి శాశ్వత సింధు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రకారం.. సింధు నదిలో 20 శాతం నీటిని ఇండియా అవసరాలకు ఉపయోగించుకుంటుంది. 80 శాతం నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అయితే 2020లో రెండు దేశాల మధ్య భేటీ జరగాల్సింది. కరోనా కారణంగా జరగలేదు.
Read Also: రాత్రిపూట తినడం మానేస్తున్నారా.. తస్మా్త్ జాగ్రత్త
ఎడారిగా మారిపోనున్న పాక్..
ఈ సింధూ నది వాటర్ ఆగిపోతే మాత్రం పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి పాకిస్థాన్ పరిస్థితి బాగులేదు. ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఇప్పటికీ అక్కడ ఆకలి చావులు ఎక్కువ అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ నీటిపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. అక్కడ ఉన్న పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు అయితే సింధూ జలాల నీరు ప్రధాన వనరు. పాక్‌లో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు చాలా తక్కువ నీటి వనరులు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఆగిపోతే మాత్రం ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా ఎడారిగా మారిపోతాయి. ఆఖరికి తాగు నీటికి కూడా ఇబ్బంది వస్తుందని అంచనా వేస్తున్నారు.