Gautam Gambhir: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
టీమిండియా హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసీస్ కశ్మర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ తెలియజేశారు. తనని చంపేస్తామంటూ బెదిరించారని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసీస్ కశ్మర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని గౌతమ్ గంభీర్ తెలియజేశారు. తనని చంపేస్తామంటూ బెదిరించారని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. గుర్తు తెలియని వాటి నుంచి ఐ కిల్ యూ అనే మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ తెలిపారు. ఇలా ఒకసారి కాదని, రెండుసార్లు వచ్చాయని పోలీసులకు వెల్లడించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి విషయంలోనే హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఉగాదాడి తర్వాత గౌతమ్ గంభీర్ స్పందించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వాళ్ల కోసం ప్రార్థిద్దామని తెలిపారు. దీనికి బాధ్యులు తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదని పోస్ట్ చేశారు. అయితే ఈ కారణంగానే గంభీర్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మెయిల్స్ ఎవరు చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2021 నవంబర్‌లో ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇలానే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
Read also: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
కశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మతం ఏంటని అడిగి మరి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిపై యావత్తు భారత్ మండిపడుతుంది. చిన్న పిల్లలు ఉన్నారని వేడుకున్నా కూడా చంపేశారు. వీరిలో కొత్తగా పెళ్లయిన వారు, కుటుంబంతో సంతోషంగా వెకేషన్‌కు వెళ్లగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆరు రోజుల కిందట పెళ్లి అయిన ఓ కొత్త జంట హనీమూన్‌కి మినీ స్వి్ట్జర్లాండ్ అయిన పహల్గామ్ వెళ్లారు. పేరు, మతం అడిగి మరి కాల్చి చంపేశారు. కేవలం పర్యాటకులనే టార్గెట్ చేసి చంపారు. దీనిపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. ఆ దేశంతో ఉన్న అన్ని రవాణాలు కూడా ఆపేసింది.
Read Also: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
ఆ దేశంతో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. చైనాలో పుట్టిన సింధూ నది భారత్ నుంచి ప్రవహించి.. పాకిస్థాన్ చేరుతుంది. అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు 1960లో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఒప్పందానికి మధ్యవర్తిత్వంగా ప్రపంచ బ్యాంకు ఉండేంది. అయితే ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వల్ల భారత్, పాక్ మధ్య ఈ నదీ జలాల సమస్య కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఈ ఒప్పందం రద్దు చేయడ వల్ల పాకిస్థాన్ ఎడారిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాక్ సింధూ నదుల జలాలపై ఆధారపడి ఉంది. ఇప్పుడు వీటిని ఆపేస్తే పాకిస్థాన్‌ప తీవ్ర ప్రభావం పడనుంది.
-
Cancellation: సింధూ జలాల ఒప్పందం రద్దు.. పాక్ ఎడారిగా మారనుందా?
-
Cow dung: ఆవు పేడతో కోట్లలో బిజినెస్.. విదేశాల్లో ఎందుకింత డిమాండ్
-
Beautiful countries: తక్కువ బడ్జెట్‌లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
-
Trump Warns: ఇప్పుడు వదిలిపోండని.. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు ట్రంప్ వార్నింగ్
-
Gautam Gambhir: పంత్‌ని కాదని.. రాహుల్‌ను గంభీర్ సెలక్ట్ చేయడానికి ముఖ్య కారణం అదేనా!