Gautam Gambhir: విరాట్, రోహిత్ ఔట్.. ఇక గౌతమ్ గంభీర్ హవానే!
ఇండియన్ క్రికెట్‌లో గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే వంటి కోచ్‌లు టీమిండియా ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించారు. కానీ అనుకున్నది చేయలేక.. పదవులను వదిలేశారు.

Gautam Gambhir: ఇండియన్ క్రికెట్‌లో గ్రెగ్ చాపెల్, అనిల్ కుంబ్లే వంటి కోచ్‌లు టీమిండియా ఆటగాళ్లను అదుపు చేయాలని ప్రయత్నించారు. కానీ అనుకున్నది చేయలేక.. పదవులను వదిలేశారు. అయితే ఇప్పుడు అంతా మారబోతుంది. రోహిత్, విరాట్ వరుసగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో ఇకపై అంతా కూడా కెప్టెన్ గౌతమ్ గంభీర్ హవానే కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు ఇద్దరూ కేవలం ఐదు రోజుల తేడాలోనే టెస్ట్ క్రికెట్‌ను రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ హవానే ఇకపై కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేస్‌లో శుభమన్ గిల్‌ను టీమిండియా కెప్టన్‌గా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇతని పేరే ఎక్కువగా వినిపిస్తోంది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఎన్ని రోజులు ఆడతారనే విషయం కూడా క్లారిటీ లేదు. బుమ్రా గాయాల కారణంగా జట్టులో ఆడుతూ.. వెళ్లిపోతున్నాడు. రాహుల్ సరిగ్గా ఆడితేనే స్టార్ ఆటగాడిగా నిలుస్తాడు. ఇలా ఉండటతో ఇకపై జట్టు మొత్తం గౌతమ్ గంభీర్ చేతిలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఇకపై జట్టు సెలక్షన్, మ్యాచ్ ప్రణాళికలు అన్ని కూడా గంభీర్ ఆధీనంలోనే ఉంటాయి. అయితే టీమిండియా జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోతుంది. రోహిత్, కోహ్లి రిటైర్ అయిన తర్వాత ఆడే మొదటి సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో జట్టు సరిగ్గా ఆడకపోతే గంభీర్‌కి ఒత్తిడి తప్పదు. అదే ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే మాత్రం మంచి పేరు వస్తుంది.
Read Also: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
ఇదిలా ఉండగా కొన్ని రోజుల కిందట రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. రెండు రోజుల కిందట కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలిపారు. 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో మొత్తం 9230 పరుగులు కోహ్లీ చేశాడు. ఇందులో 68 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్ట్ క్రికెట్‌లో మొదటి సారి బ్యాగీ బ్లూ ధరించి ఆడి 14 సంవత్సరాలు అయిందన్నారు. ఈ టెస్ట్ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఇది నన్ను పరీక్షించింది, నన్ను ఎంతో బాగా తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన ఎన్నో పాఠాలను నేర్పింది. తెల్లని దుస్తులు ధరించడంలో ఎంతో ఆనందం ఉంది. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయని పోస్ట్ చేశారు. ఈ ఫార్మాట్‌ను వదలడం అంత ఈజీ కాదు.. కానీ వదలడం కరెక్ట్ అనిపిస్తుందన్నారు. నేను ఆడవలసిన విధంగా ఆడాను.. అంతకు మించి ఆట నాకు ఎన్నో నేర్పిందన్నారు. సంతోషంగా వెళ్లిపోతున్నాను.. ఎల్లప్పుడూ కూడా టెస్ట్ కెరీర్‌ను కూడా ఎంతో సంతోషంగా తిరిగి చూసుకుంటానని కోహ్లీ తెలిపారు. ఇప్పుడు వీరి రిటైర్మెంట్‌తో గౌతమ్ గంభీర్ టీమిండియాను ఎలా గుప్పెట్లో పెట్టుకుంటాడో చూడాలి.
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Test Matches: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
-
Gautam Gambhir: ఉగ్రదాడి ఎఫెక్ట్.. గౌతమ్ గంభీర్‌కు హత్య బెదిరింపులు
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!