AP Assembly : ఏపీ అసెంబ్లీ.. ఫోటో సెషన్స్ అదుర్స్!

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget meetings ) తుది దశకు చేరుకున్నాయి. రేపటితో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. శాసనమండలి సమావేశాలకు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరయ్యింది. ఆ పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొనడంతో వాడీ వేడిగా సమావేశాలు జరిగాయి. మరోవైపు సమావేశాలు ముగింపు సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వేరువేరుగా ఫోటో సెషన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం పాల్గొన్నారు.
Also Read : విశాఖలో వైసీపీకి షాక్.. ఆ తొమ్మిది మంది రాజీనామా!
* ఆసక్తికరంగా సీన్
అయితే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు( MLC) ఒకే చోట చేరడంతో ఆసక్తికరంగా మారింది. తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం సీఎం చంద్రబాబు తో మాట్లాడారు. మీతో ఫోటో దిగడం నా అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆమె వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు షాక్ కు గురయ్యారు. త్వరలో రిటైర్ కాబోతున్న ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిసి ఫోటో దిగాలని కోరారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా చేతిలో లక్ష్మణరావు ఓడిపోయారు. దీంతో ఆయన కోరిన విధంగా చంద్రబాబు ఫోటో దిగి సంతృప్తి పరిచారు.
* కౌన్సిల్లో సందడి
అటు శాసనమండలిలో( Council) సభ్యులంతా ఒకచోట చేరే సరికి సందడి వాతావరణం నెలకొంది. మండలిలో చైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వడం లేదని మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు, చైర్మన్ మోసేన్ రాజు సమక్షంలో సరదాగా కామెంట్ చేశారు. చంద్రబాబు స్పందించారు. పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలి అని సూచించారు. మరోవైపు ఫోటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అంటూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తెలిపారు. అయితే బొత్స పొరపాటున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. దీనిపై లోకేష్ స్పందించి అప్పటికప్పుడు బొత్స కోసం మరో కుర్చీ ఏర్పాటు చేశారు.