AP Nursing: ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఔట్
డాక్టర్ విద్యను చదవలేని కొందరు నర్సింగ్ చేస్తుంటారు. నర్సింగ్ జాయిన్ అయినా కనీసం వారి ఆశలను ఫుల్ ఫిల్ చేసుకుంటారు. అయితే ఏపీ బిఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశం కోసం ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.

AP Nursing: డాక్టర్ విద్యను చదవలేని కొందరు నర్సింగ్ చేస్తుంటారు. నర్సింగ్ జాయిన్ అయినా కనీసం వారి ఆశలను ఫుల్ ఫిల్ చేసుకుంటారు. అయితే ఏపీ బిఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశం కోసం ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ కోర్సులో ప్రవేశాల కోసం ఏపీఎన్‌సెట్ 2025ను నిర్వహిస్తోంది. ఏపీఎన్ సెట్‌లో కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్‌మెంట్ కోటాలో కూడా నర్సింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షకు హాజరు కావాలి. అయితే ఈ పరీక్ష రాసిన తర్వాత ర్యాంకు బట్టి ఉంటుంది. మొత్తం నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవుతారు. అయితే ఈ ఏపీ నర్సింగ్ సెట్‌కు అప్లై చేయాలంటే తప్పకుండా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. బైపీసీలో కనీసం 45శాతం మార్కులతో పాస్ అయి ఉన్నవారు అప్లై చేసుకోవాలి. ఈ సెట్ ద్వారా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలతో పాటు నాన్ మైనార్టీ, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, మైనార్టీ నర్సింగ్ కాలేజీల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగేళ్ల ఫుల్ టైమ్ కోర్సు ఉంటుంది. మొత్తం ఎనిమిది సెమిస్టర్లతో ఈ కోర్సు పూర్తి అవుతుంది.
Read Also: అప్పు చేసి షేర్లు కొంటున్నారా.. అయితే ఇది మీ కోసమే
ఏపీఎన్ సెట్‌కు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ నేడే ప్రారంభమైంది. జూన్ 20వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1180 చెల్లించాలి. పరీక్ష రుసుము రూ.వెయ్యితో పాటు 18శాతం జిఎస్టీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులు రూ.944 చెల్లించాలి. రూ.800 ఫీజుతో పాటు రూ.144జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ క్యాటగిరీలో ఉన్న సీట్లను మాత్రం భారతీయ పౌరులు అప్లై చేసుకోవాలి. మిగతా వారికి కుదరదు. నర్సింగ్ కోర్సుకు పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు ఓసీ అభ్యర్థులకు 50శాతం అర్హత మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 40శాతం అర్హత మార్కులు రావాలి. జనరల్ క్యాటగిరీ వికలాంగులకు 45శాతం అర్హత మార్కులు రావాల్సి ఉంటుంది.
Read Also: కండరాల బలహీనత, ఆస్తమాకు ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి
ఇంటర్మీడియట్‌లో ఓసీ అభ్యర్థులకు బైపీసీలో 45శాతం మార్కులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. డిసెంబర్ 31కి 17 ఏళ్లు అయి ఉండాలి. లేదా 2008 డిసెంబర్ 31 కంటే ముందు అయిన జన్మించాలి. ఏపీఎన్ సెట్ మెరిట్ జాబితాను మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు ఎస్సెస్సీ మార్కుల జాబితా, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఇంటర్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికెట్, వైకల్య ధృవీకరణ, ఆధార్ గుర్తింపు పత్రం, పాస్ పోర్ట్ ఫోటో, సంతకం, ఫింగర్ ప్రింట్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు ఉంటే 90007 80707, 80082 50842 నంబర్లకు వెంటనే సంప్రదించవచ్చు. అలాగే అర్హత పరీక్షపై ఏవైనా సందేహాలు ఉంటే 89787 80501, 93918 05245 నంబర్లకు కాంటాక్ట్ కావాలి. సందేహాలకు ap.uhs.support@aptonline.in మెయిల్ చేయవచ్చు.