Telugu States Rains: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
Telugu States Rains మూసీ పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Telugu States Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. హిమాయత్ సాగర్, తుంగభద్ర డ్యాం, శ్రీశైలం జలాశయాల్లో భారీగా వరద్ ప్రవహిస్తోంది. తిరిగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. రాజేంద్రనగర్, హిమాయత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మూసీ పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంచ్ లెవెల్ దాటింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. బంజారాహిల్స్, బుల్కాపూర్, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వస్తోంది. నల్లొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.