Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
Gold prices : ప్రస్తుతం రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్కెట్‌లో బంగారం విలువ ఎక్కువగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువగా ఉంది.

Gold prices : ప్రస్తుతం రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్కెట్‌లో బంగారం విలువ ఎక్కువగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియాలో పెళ్లి అంటే ముందుగా గుర్తు వచ్చేది బంగారం. ఏదైనా ఫంక్షన్, పెళ్లి, పండుగ ఉంటే చాలు.. మహిళలు బంగారు ఆభరణాలతో నిండుగా తయారు అవుతారు. పెళ్లిలో బంగారం కూడా కట్నంగా మారిపోయింది. దీంతో బంగారం విలువ రోజురోజుకీ పెరుగుతుంది. ప్రస్తుతం తులం బంగారం విలువ లక్ష పైనే ఉంది. ఈ బంగారాన్ని కొన్న తర్వాత అమ్మేసుకున్నా పర్లేదు.. అని చాలా మంది దీన్ని కొని దాచుకుంటున్నారు. రోజురోజుకీ బంగారం ధర పెరగడం వల్ల చాలా మంది ముందుగానే కొనుక్కుంటున్నారు. భవిష్యత్తులో దీని ధర పెరుగుతుందని చాలా మంది ఎంత ఖరీదు ఉన్నా కూడా కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డులను దాటింది. అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. నేడు బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డులను దాటాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,920 గా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.84,260 గా ఉంది. నేడు ఒక గ్రాము రేటు రూ.9192గా ఉంది. అయితే బంగారం ధరలు ప్రాంతం, సమయాన్ని బట్టి మారుతుంటాయి. అయితే కేవలం బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,12,900గా ఉంది.
ఇదిలా ఉండగా.. బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తారు. అయితే క్యారట్ల వాల్యూ బట్టి బంగారం ధర ఉంటుంది. బంగారం ఎంత స్వచ్ఛత ఉంటే అంత ఖరీదు ఉంటుంది. 99.9 స్వచ్ఛమైన బంగారం 24 క్యారట్లు ఉంటుంది. ఈ బంగారం స్వచ్ఛమైనది. అయితే ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్‌లలో దొరుకుతుంది. బంగారంలో 24 క్యారట్లదే ఎక్కువ ధర ఉంటుంది. దీన్ని కరిగించి ఇందులో రాగి కలిపి ఆభరణాలు చేస్తారు. 22 క్యారట్ల బంగారాన్ని ఎక్కువగా నగలు తయారీకి వాడుతారు. వీటిలో లోహాలు కలిపి తయారు చేస్తారు. బంగారంతో చేసిన ఆభరణాలు అన్ని కూడా 22 క్యారట్లతోనే తయారు చేస్తారు.
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి