Balaji Srinivasan : సింగపూర్ పక్కన టెకీల కోసం కొత్త దేశాన్ని నిర్మిస్తున్న భారతీయుడు

Balaji Srinivasan : మనం విదేశాలకు వెళ్లాలి అనుకుంటే తప్పనిసరిగా వీసా కావాల్సిందే. వెళ్లిన తర్వాత అక్కడ నివసించడానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని సందేహాలు మనసులోకి వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఈ తరహా ఆలోచనలకు ఫుల్ స్టాప్ ఓ భారతీయ మూలాలున్న అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ బాలాజీ శ్రీనివాసన్ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ఒక భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త అయిన బాలాజీ శ్రీనివాసన్ సింగపూర్ దగ్గర ఒక ప్రైవేట్ ఐలాండ్ కొని, అక్కడ టెక్ నిపుణుల కోసం ఒక కొత్త దేశాన్ని నిర్మిస్తున్నారు. ఈ దేశానికి ఆయన నెట్వర్క్ స్టేట్ అని పేరు పెట్టారు. అంటే, ఇది డిజిటల్‌గా మొదలై తర్వాత నిజమైన దేశంగా మారే ఒక ఆలోచన అన్నమాట. బాలాజీ శ్రీనివాసన్ మొదలుపెట్టిన నెట్వర్క్ స్కూల్ లో పాల్గొంటున్న నిక్ పీటర్సన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ ద్వీపాన్ని శ్రీనివాసన్ తన పెద్ద కలైన నెట్వర్క్ స్టేట్‌ను పరీక్షించడానికి వాడుతున్నారు.
Read Also:Harihara Veeramallu : పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ.. ‘హరిహర వీరమల్లు’ ఎంత వసూలు చేస్తే సేఫ్?
ఎవరీ బాలకృష్ణ శ్రీనివాసన్?
బాలాజీ శ్రీనివాసన్ ఒక భారత సంతతికి చెందిన టెక్ వ్యాపారవేత్త. ఆయన కౌన్సిల్ అనే కంపెనీని స్థాపించారు. కోన్బేస్ అనే పెద్ద క్రిప్టో కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే, ఆండ్రీస్సెన్ హోరోవిట్జ్ అనే ప్రముఖ పెట్టుబడి సంస్థలో భాగస్వామిగా కూడా ఉన్నారు. తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్ళిన డాక్టర్ల కుటుంబంలో పుట్టారు బాలాజీ. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఉన్నత చదువులు చదివారు.
నెట్వర్క్ స్టేట్ అంటే ఏమిటి?
శ్రీనివాసన్ కల నెట్వర్క్ స్టేట్ నిర్మించడం. అంటే, ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కలిసి ఒక సమాజంగా ఏర్పడతారు. వీళ్ళు ఒక దేశంలాగా ఒకరికొకరు సహకరించుకుంటారు. కొత్త ఆవిష్కరణలు, క్రిప్టోకరెన్సీ, వ్యక్తిగత స్వేచ్ఛ, టెక్నాలజీ అభివృద్ధి లాంటి వాటిపై వీరు దృష్టి పెడతారు.
శ్రీనివాసన్ ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ యుగానికి తగ్గట్టుగా ప్రజాస్వామ్యాన్ని మార్చాలి. అలాగే, ఆరోగ్యం, మంచి జీవితం అనేవి అందరికీ అందుబాటులో ఉండాలి. దీని కోసం ప్రజలు వ్యక్తిగతంగా, శారీరకంగా, వృత్తిపరంగా ఎదగాలని ఆయన నమ్ముతారు. నెట్వర్క్ స్కూల్ 2024 సెప్టెంబర్‌లో మొదలైంది. ఇది మూడు నెలల ప్రోగ్రామ్. స్టార్టప్ కంపెనీల యజమానులు, ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు ఇందులో చేరవచ్చు. ఆన్లైన్లో మొదలై, తర్వాత నిజమైన సమాజాలుగా మారే నెట్వర్క్ స్టేట్లను తయారు చేయాలనే శ్రీనివాసన్ ఆలోచనకు ఈ స్కూల్ ఒక ప్రయోగంలా పనిచేస్తుంది.
ద్వీపాన్ని ఎలా కొన్నాడు?
2024 ఆగస్టులో ఒక బ్లాగ్ పోస్ట్‌లో శ్రీనివాసన్ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. తాను స్కూల్ మొదలుపెట్టడానికి సింగపూర్ దగ్గర ఒక ద్వీపాన్ని కొన్నానని చెప్పారు. బిట్ కాయిన్ సాయంతో సింగపూర్ దగ్గర ఒక అందమైన ద్వీపం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎవరికీ తెలియని గొప్ప టాలెంట్‌ను ఈ స్కూల్లో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.