Home Loan : లోన్లు తీసుకునే వారికి ఇది శుభవార్త

Home Loan : ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వాళ్ళకు ఇది నిజంగా గుడ్ న్యూస్. LIC హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ శనివారం (జూన్ 21) నాడు ఒక పెద్ద ప్రకటన చేసింది. కొత్త హోమ్ లోన్‌లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అంటే 0.50 శాతం) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జూన్ 19 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇదే రోజు కంపెనీ 36వ వార్షికోత్సవం కావడంతో దాని సందర్భంగా ఈ తగ్గింపును ప్రకటించారు.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేట్లను తగ్గించింది. దీని తర్వాతే LIC హౌసింగ్ ఫైనాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తగ్గించిన లాభాన్ని కొత్త హోమ్ లోన్ కస్టమర్లకు అందించడం ద్వారా, సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి, తక్కువ ధరలో ఇల్లు కొనడానికి వాళ్లు ప్రోత్సహిస్తున్నారు.
Read Also:Harrier EV : హారియర్లో ఉన్న ఈ 5 ఫీచర్లు మరే ఎలక్ట్రిక్ కార్లలో లేవు.. టాటా అద్భుతం
LIC హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ త్రిభువన్ అధికారి మాట్లాడుతూ.. “మా 36వ వార్షికోత్సవం సందర్భంగా సొంత ఇల్లు కొనడం అందరికీ సులభతరం చేయడమే మా లక్ష్యం. ఆర్బీఐ పాలసీకి తగ్గట్టుగా నడుచుకుంటూ, ఆ లాభాలను మా కస్టమర్లకు అందించడంలో భాగంగానే ఈ వడ్డీ రేట్ల తగ్గింపు” అని చెప్పారు.
ఈ వారంలోనే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్బీఐ పాలసీ రేట్ల తగ్గింపు తర్వాత తన లోన్ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో, ఎస్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ 50 బేసిస్ పాయింట్లు తగ్గి 7.75 శాతానికి వచ్చింది. ఎస్బీఐ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ను కూడా 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, అంతకు ముందున్న 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తీసుకువచ్చింది. ఎస్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు జూన్ 15 నుంచే అమల్లోకి వచ్చింది.
Read Also:Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు
ఆర్బీఐ నిర్ణయం తర్వాత చాలా బ్యాంకులు తమ లోన్ రేట్లను తగ్గించాయి. ఇంతకు ముందు, HDFC బ్యాంక్ కూడా తన లోన్ రేట్‌ను తగ్గించి, రూ.₹3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్టంగా 6.6 శాతం వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేసింది.