Harrier EV : హారియర్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మరే ఎలక్ట్రిక్ కార్లలో లేవు.. టాటా అద్భుతం

Harrier EV : టాటా కంపెనీ తాజాగా తన హారియర్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది చాలా పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీని స్టార్టింగ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.21.49 లక్షలు. ఇది ఇప్పటివరకు టాటా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ SUV లలోకెల్లా పెద్దది. Curvv.ev కారు కంటే కూడా ఇది పెద్దగా ఉంటుంది. ఈ కారు బుకింగ్స్ జులై 2వ తేదీ నుంచి మొదలవుతాయి. డెలివరీ తేదీని తర్వాత ప్రకటిస్తారు. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జీ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్తుందని టాటా కంపెనీ చెబుతోంది.
హారియర్ ఈవీని మొత్తం 3 వేరియంట్లలో లాంచ్ చేశారు. అవి అడ్వెంచర్, ఫియర్లెస్, ఎంపవర్డ్. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 65 kWh, 75 kWh. అంతే కాకుండా ఈ కారులో ఎన్నో కొత్త, ప్రత్యేకమైన ఫీచర్లు ఇచ్చారు. అవి మిగిలిన ఎలక్ట్రిక్ కార్ల కంటే దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అవేంటో చూద్దాం..
హారియర్ EV లోని 5 అదిరిపోయే ఫీచర్లు:
టెర్రైన్ మోడ్స్ : టాటా హారియర్ ఈవీలో మొత్తం 6 రకాల టెర్రైన్ మోడ్స్ ఇచ్చారు. అవి నార్మల్, గ్రాస్/స్నో (గడ్డి/మంచు), మడ్రాట్స్/గ్రేవల్ (బురద/కంకర), సాండ్ (ఇసుక), రాక్ క్రాల్ (రాళ్లపై నడవడానికి).. కారు యూజర్ దారికి అనుగుణమైన మోడ్ సెలక్ట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా, AWD సిస్టమ్ (అన్ని చక్రాలకు పవర్ ఇచ్చే సిస్టమ్) లో బూస్ట్, స్పోర్ట్, సిటీ, ఎకో లాంటి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. RWD సిస్టమ్‌లో ఎకో, సిటీ, స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి.
Read Also:Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు
540-డిగ్రీ సరౌండ్ వ్యూ : చాలా కార్లలో 360-డిగ్రీ కెమెరా ఉంటుంది. కానీ టాటా హారియర్ ఈవీలో 540-డిగ్రీ సరౌండ్ వ్యూ అనే అద్భుతమైన ఫీచర్ ఇచ్చారు. ఇందులో 360-డిగ్రీ వ్యూ తో పాటు, ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా ఉంటుంది. దీనివల్ల డ్రైవర్ కారు కింద ఏం ఉందో కూడా చూడొచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది.
AWD పవర్ట్రైన్ : ఈ కారులో చాలా పెద్ద హైలైట్ ఏంటంటే, దీని ఆల్-వీల్-డ్రైవ్ (AWD) పవర్ట్రైన్. దీన్ని QWD అని పిలుస్తున్నారు. AWD సిస్టమ్ ఉన్న టాటా మొదటి ఎలక్ట్రిక్ SUV ఇది. సఫారీ స్టార్మ్ తర్వాత, మళ్ళీ టాటా బ్రాండ్ నుంచి వస్తున్న మొదటి AWD కారు ఇదే. ఇందులో రెండు మోటార్లు ఉంటాయి, ఒకటి ముందు, ఇంకొకటి వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి.
కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ : హారియర్ ఈవీలో 14.53 అంగుళాల సినిమాటిక్ డిస్ప్లే ఇచ్చారు. ఇది హార్మన్ కంపెనీ తయారు చేసింది. ఇందులో శాంసంగ్ నియో క్యూఎల్ఈడి టెక్నాలజీ ని వాడారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమోటివ్ నియో క్యూఎల్ఈడి డిస్ప్లే ఇదేనట. దీంతో పాటు, కారు లోపల మరింత మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ప్రపంచంలోనే మొదటి జేబీఎల్ బ్లాక్ 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను ఇచ్చారు. ఇది డాల్బీ అట్మాస్ తో వస్తుంది.
Read Also:Recharge Plan : జియో, ఎయిర్టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?
కొత్త డిజిటల్ కీ : టాటా మోటార్స్ హారియర్ ఈవీకి ఒక డిజిటల్ కీని కూడా ఇచ్చింది. దీనివల్ల మీరు మీ మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌తోనే కారును తెరవొచ్చు, నడపొచ్చు. అంటే ఫిజికల్ లాక్ అవసరం లేదు. ఇది కాకుండా, ఒక స్మార్ట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఒక కొత్త రౌండ్ సర్క్యులర్ కీని కూడా ఇచ్చారు. దీనితో 11 రకాల పనులను చేయవచ్చు. ఉదాహరణకు, రిమోట్ పార్క్, సమ్మన్ మోడ్ లాంటివి.