Toyota EV : టయోటా నుంచి సంచలనం.. 500 కి.మీ.ల రేంజ్‌తో రాబోతున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు!

Toyota EV : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ రేసులో దాదాపు అన్ని కార్ కంపెనీలు తమ సత్తా చాటడానికి పోటీ పడుతున్నాయి. ఇలాంటప్పుడు టయోటా (Toyota) మాత్రం ఎలా వెనుకబడి ఉంటుంది .. అందుకే ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కూడా త్వరలోనే భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుంది. ఆ కారే టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ (Toyota Urban Cruiser EV). ఇది త్వరలోనే భారతదేశంలో లాంచ్ కానుంది.
టయోటా తన మొదటి ఎలక్ట్రిక్ కారును బ్రస్సెల్స్‌లో ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి ఆవిష్కరించింది. భారతదేశంలో దీనిని మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 సందర్భంగా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం.. టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ ఈ సంవత్సరం చివరి నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ ఒక పూర్తి సైజు ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఇది చాలా విశాలంగా ఉండటమే కాకుండా రోడ్డుపై ఇది పోతుంటే అందరి కళ్లు దీని మీదే ఉంటాయి. దీని లుక్ కూడా చాలా క్లాసీగా, ఆకర్షణీయంగా ఉంది. ఇది మారుతి ఇ-విటారా (Maruti e-Vitara) వంటి పాపులర్ ఎస్‌యూవీల కంటే పెద్దదిగా ఉంటుంది. టయోటా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కేవలం భారతదేశం కోసం మాత్రమే కాకుండా, ప్రపంచ ఎగుమతుల (export) కోసం కూడా తయారు చేస్తోంది. అంటే, భారతదేశం నుంచి ఇతర దేశాలకు కూడా ఈ కారును ఎగుమతి చేసే అవకాశం ఉంది.
Read Also:Kidney Stones : వేసవిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం.. ఎందుకు పెరుగుతాయి? ఎలా జాగ్రత్త పడాలి?
పవర్ట్రైన్, బ్యాటరీ
టయోటా ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని రెండు బ్యాటరీ ఆప్షన్లతో తీసుకురానుంది.అవి ఒకటి 49kWh బ్యాటరీ ప్యాక్, రెండోది 61kWh బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం.. 61kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇవ్వగలదు. ఇది నిజమైతే ఇది భారతదేశంలో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రస్తుత మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు 400 కి.మీ.ల లోపే రేంజ్ ఇస్తున్న నేపథ్యంలో టయోటా 500 కి.మీ.ల మైలురాయిని అధిగమిస్తే అది వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా నిలుస్తుంది.
అత్యాధునిక ఫీచర్స్
టయోటా అర్బన్ క్రూజర్ ఈవీలో ప్రీమియం మరియు ఆధునిక ఫీచర్లు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది.ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ (Panoramic Sunroof) ఉండవచ్చు. ఇది కారు లోపల లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది. 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ అమర్చబడి ఉంది. ఇది పార్కింగ్, డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది. డ్రైవర్ సౌకర్యం కోసం పవర్డ్ డ్రైవర్ సీట్ (Powered Driver Seat) ఉంటుంది. భద్రత, సౌకర్యంపై దృష్టి సారించి, కంపెనీ ఇందులో ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (Electronic Parking Brake with Auto Hold Function) కూడా అందించనుంది.వినోదం కోసం 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో చూడవచ్చు. టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పోటీదారుగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Read Also:Akhil Akkineni: అక్కినేని వారింట మోగనున్న పెళ్లి బాజా.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్