New Bikes : 2025 చివరి నాటికి మార్కెట్లో కొత్త సెన్సేషన్ – ఏ బైక్‌లు రాబోతున్నాయో తెలుసా ?
New Bikes : త్వరలో కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. కాస్త ఆగండి. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో అనేక మిడిల్‌వెయిట్ (500సీసీ లోపు)బైక్స్ రాబోతున్నాయి. వీటిలో టీవీఎస్ (TVS), హీరో (Hero), ట్రయంఫ్ (Triumph) వంటి ప్రముఖ టూవీలర్ కంపెనీల బైక్స్ ఉన్నాయి. ఈ రాబోయే మోడళ్ల టెస్టింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్న ఈ కొత్త మిడిల్‌వెయిట్ మోటార్‌సైకిళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
టీవీఎస్ F 450 GS
టీవీఎస్ F 450 GS బైక్ గత నెల (మే 2025) హోసూర్‌లోని ఫ్యాక్టరీ సమీపంలో భారతీయ రహదారులపై మొదటిసారిగా కెమెరాకు చిక్కింది. ఈ ADV బైక్ ఇటలీలోని మిలన్లో జరిగిన EICMA 2024లో ఒక కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించారు. దీనిని 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించారు. ఈ బైక్ రాబోయే 2-3 నెలల్లో (ఆగస్టు-సెప్టెంబర్ 2025 నాటికి) విడుదల కావచ్చు. ఇది BMW F 450 GS, KTM 390 Enduro R, కవాసకి వెర్సెస్ X 300 వంటి బైక్‌లకు పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
టీవీఎస్ అపాచీ 450
టీవీఎస్ తన ప్రసిద్ధ అపాచే ఆర్టిఆర్ సిరీస్‌లో 450సీసీ వెర్షన్‌పై పని చేస్తోంది. ఇది BMW 450 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. రాబోయే టీవీఎస్ అపాచీ 450 ఒక ఫుల్లీ-ఫెయిర్డ్ సూపర్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ అవుతుంది. భారత మార్కెట్లో ఈ బైక్ 2026 ప్రారంభంలో రిలీజ్ కావచ్చు.
Read Also:Kantara : ‘కాంతార’ షూటింగ్లో ప్రమాదం – చిత్ర యూనిట్‌కు నోటీసులు!
నార్టన్ 450cc బైక్
నార్టన్ మోటార్‌సైకిల్ 2025 చివరి నాటికి భారతదేశంలో తన మొదటి 450సీసీ మోడల్‌ను విడుదల చేయనుంది. టీవీఎస్ యాజమాన్యంలోని ఈ బ్రిటీష్ బ్రాండ్ భారతదేశంలో తమ బైక్‌ల కోసం BMW 450 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుంటుంది. నార్టన్ 450సీసీ బైక్ భారతదేశంలో తమిళనాడులోని హోసూర్‌లోని టీవీఎస్ ఉత్పత్తి కేంద్రంలో స్థానికంగానే తయారు చేయనున్నారు.
హీరో ఎక్స్‌పల్స్ 421
హీరో ఎక్స్‌పల్స్ 421 కంపెనీ ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఇది ఇటలీలోని మిలన్లో జరిగే EICMA 2025లో ఆవిష్కరించబడుతుంది. మార్కెట్లో ఇది KTM 390 అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, TVS అపాచీ RTX 300 వంటి బైక్‌లతో పోటీ పడుతుంది. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ భారతదేశంలో 2026 ప్రారంభంలో సేల్స్ కు వచ్చే అవకాశం ఉంది.
ట్రయంఫ్ థ్రక్స్టన్ 400
ట్రయంఫ్ భారతీయ మార్కెట్లో థ్రక్స్టన్ 400తో తన 400cc బైక్ సిరీస్ విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రస్తుతం భారతదేశంలో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X, స్క్రాంబ్లర్ 400 XC, స్పీడ్ T4 మోడళ్లను విక్రయిస్తోంది. థ్రక్స్టన్ 400 ఒక కేఫ్-రేసర్ మోడల్ కావడం వల్ల స్పీడ్ ట్రిపుల్ 1200 RR నుండి స్టైలింగ్ తీసుకుంటుంది. నివేదికల ప్రకారం, దీనిని ఈ ఏడాది చివరిలో (పండుగల సీజన్ 2025లో) విడుదల చేయనుంది. ఈ కొత్త మోడళ్లు భారత టూ వీలర్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయని, వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను అందిస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Also:Passport Process : ఆన్లైన్లో త్వరగా పాస్‌పోర్ట్ ఎలా పొందాలి?.. అవసరమైన పత్రాలు ఇవే!



