Maruti Suzuki Jimny : లక్ష దాటిన జిమ్నీ అమ్మకాలు..దీనికి ఇంత డిమాండ్ ఎందుకో తెలుసా ?

Maruti Suzuki Jimny : ఒక పవర్ ఫుల్ ఎస్యూవీ (SUV) కొనాలని ఆలోచిస్తున్నారా.. మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) పేరు కచ్చితంగా వినే ఉంటారు. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ డ్రైవింగ్ ను ఇష్టపడే వారిలో జిమ్నీ చాలా పాపులారిటీ పొందిన వెహికల్ గా మారింది. అయితే, జిమ్నీలో అత్యంత చవకైన మోడల్ ఏది? ప్రజలు దీన్ని కొనుగోలు చేయడానికి ఎందుకు క్యూ కడుతున్నారు? ఇప్పటికే లక్ష వెహికల్ సేల్ మార్కు దాటిన దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జిమ్నీలో అత్యంత చవకైన మోడల్ ఏది?
జిమ్నీ అత్యంత బేసిక్, చవకైన వేరియంట్ జిమ్నీ జెటా పెట్రోల్ మాన్యువల్ (Jimny Zeta Petrol Manual) వేరియంట్. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 12.75 లక్షల రూపాయలు. ఇది అత్యంత బేసిక్ మోడల్ ధర. ఇందులో మారుతి లేటెస్ట్ టెక్నాలజీ, అత్యంత పవర్ ఫుల్ పర్ఫామెన్స్ అందిస్తుంది.
Read Also:Micro Workouts : జిమ్‌కు వెళ్లడానికి టైం లేదా?.. ఈ మైక్రో వర్కౌట్స్ ట్రై చేయండి
ఈ మోడల్లో ఏమేమి లభిస్తాయి?
జిమ్నీ జెటా వేరియంట్ బేస్ మోడల్ అయినప్పటికీ ఫీచర్ల విషయంలో ఇది ఏమాత్రం తక్కువ కాదు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (K15B సిరీస్), 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 4×4 డ్రైవ్ సిస్టమ్ (ఏ వాతావరణంలోనైనా, ఏ రోడ్డులోనైనా నడిచేది), రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ + ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోలు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , స్ట్రాంగ్ బాడీ లభిస్తాయి.
ఈ మోడల్‌ను ప్రజలు ఎందుకు బుక్ చేస్తున్నారు?
జిమ్నీ జెటా మాన్యువల్ వేరియంట్‌ను ప్రజలు ఇంతగా ఇష్టపడటానికి కారణం ఇది అత్యంత తక్కువ ధరకు లభించే ఆఫ్-రోడింగ్ ఎస్యూవీ కావడం. జిమ్నీ భారతదేశంలో అత్యంత చవకైన 4×4 ఎస్‌యూవీలలో ఒకటి. మారుతి వాహనాల మెయింటెనెన్స్ చాలా చవకైనది. ఇందులో మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా స్టైలిష్, కాంపాక్ట్ డిజైన్, మారుతి సుజుకి నెట్వర్క్,నమ్మకం కారణంగా ప్రజలు దీనిని భారీగా ఇష్టపడుతున్నారు.
Read Also:Viral Video : వందలాది ప్రాణాలను కాపాడిన ఫైలట్.. వైరల్ అవుతున్న వీడియో
సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్
జిమ్నీకి పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొన్ని నగరాల్లో ఈ మోడల్‌పై సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ కూడా నడుస్తోంది. ముఖ్యంగా జెటా వేరియంట్ ధర, పర్ఫామెన్స్ దీనిని మీడియం బడ్జెట్ కొనుగోలుదారులకు ఇష్టమైన వెహికల్ గా మార్చింది. ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడి, బడ్జెట్ పరిమితులు ఉన్నట్లయితే జిమ్నీ జెటా వేరియంట్ సరైన ఆప్షన్ కావచ్చు.