Ola Roadster X : ఒక్క చార్జ్‌తో 252 కి.మీ మైలేజ్.. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌పై బంపర్ ఆఫర్..ఇది పోతే మళ్లీ రాదు

Ola Roadster X : ఓలా తన తొలి ఎలక్ట్రిక్ బైక్ డెలివరీల డెలివరీలను ప్రారంభించింది. ఇలా ప్రారంభమైన కొద్ది రోజులకే కొనుగోలుదారులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. ఓలా తన ఎలక్ట్రిక్ బైక్ ధరను ఏకంగా రూ.10,000 తగ్గించింది. అయితే, ఈ ఆఫర్ మొదట 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద ఓలా మూడు ప్రయోజనాలను అందిస్తోంది. వాటిలో బ్యాటరీకి ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ, MoveOS+ ఉచిత సబ్స్క్రిప్షన్, టూ-వీలర్‌తో పాటు ఉచిత ఎసెన్షియల్ కేర్ సర్వీస్ ఉన్నాయి.
ఆఫర్ వివరాలు, సర్వీసులు
ఎసెన్షియల్ కేర్ సర్వీస్‌లో 18-పాయింట్ తనిఖీ ఉంటుంది. దీని ద్వారా బైక్ సేఫ్టీ, పనితీరును పూర్తిగా పరిశీలిస్తారు. బ్రేక్‌లు, టైర్లు, యాక్సిల్స్ వంటి భాగాలకు సమగ్ర సర్వీసింగ్ కవరేజీతో పాటు, ఒరిజినల్ స్పేర్‌పార్ట్స్, నిపుణులైన సర్వీస్ హామీ కూడా ఉంటుంది. రోడ్‌స్టర్ X అనే ఈ బైక్‌ను ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని డీలర్‌షిప్‌లలో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేయవచ్చు.
Read Also:Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా
ఓలా ఎలక్ట్రిక్ బైక్ డిజైన్, ఫీచర్లు
ఓలా రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, రేంజ్ ఆధారంగా 3 మోడల్స్‌లో వస్తుంది. దీని ప్రతి వెర్షన్లోనూ 4.3 అంగుళాల LCD ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ అన్ని మోడల్స్ బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్ డిజైన్ ఉంటుంది. దీనికి 18 అంగుళాల ముందు అల్లాయ్ వీల్, 17 అంగుళాల వెనుక అల్లాయ్ వీల్ ఉన్నాయి. రెండింటిలోనూ ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. మోటార్‌సైకిల్‌కు 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.
రేంజ్, ధర
ఓలా ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మూడు మోడల్స్‌లో వేర్వేరు సైజుల బ్యాటరీలు ఉన్నాయి. అవి 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh. అయితే, బ్యాటరీ సైజు ఏదైనా అన్ని వేరియంట్లలో ఒకే 7 kW మిడ్-మౌంటెడ్ మోటార్ ఉంటుంది. మూడు మోడల్స్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి వరుసగా 140 కి.మీ, 196 కి.మీ, 252 కి.మీ రేంజ్ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 3.1 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కి.మీ టాప్ స్పీడ్‌ను చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 118 కి.మీ. ఈ బైక్ ధర సుమారు రూ.లక్ష నుంచి రూ.1.4 లక్షల వరకు ఉంటుంది.
Read Also:IPL 2025: క్వాలిఫైయర్-2 ముంబైకి కలిసొస్తే… కప్ ఖాయమా?