Pan Cards: మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.. అయితే ఇది మీ కోసమే!

Pan Cards: పాన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కువగా డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకున్నా, ఆదాయపు పన్ను కోసం తప్పకుండా పాన్ కార్డు ఉండాలి. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే తప్పకుండా కూడా పాన్ కార్డు ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. దీంతో కొందరు రెండు పాన్ కార్డులను వాడుతుంటారు. అయితే ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండవచ్చా? రెండు పాన్ కార్డులు ఉంటే నేరమా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ఆదాయపు పన్ను శాఖ రూల్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండకూడదు. పాన్ కార్డును కేవలం ఒక వ్యక్తి పేరు మీద మాత్రమే ఉంటుంది. ప్రతీ వ్యక్తికి ఒక నంబర్‌తో పాన్ కార్డు ఇస్తారు. వేర్వేరుగా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. దీనికి జరిమానా కూడా విధించే అవకాశం కూడా ఉంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 272B ప్రకారం తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటారు. రూ.10,000 జరిమానా విధిస్తారు. రెండు పాన్ కార్డులు ఉంటే కేవలం ఒక పాన్ కార్డు ఉంచుకుని ఇంకోటి అధికారులకు సరెండర్ చేయాలి. అయితే కొందరు ముందుగా పాన్ కార్డు అప్లై చేశాక.. అది కొన్ని రోజుల వరకు రాదు. దీంతో మరోసారి పాన్ కార్డుకు అప్లై చేసుకుంటారు. దీనివల్ల రెండు పాన్ కార్డులు ఉంటాయి. అయితే మరికొందరు పాన్ కార్డులో తప్పులు ఉంటాయని కొందరు మార్చుకుంటారు. ఈ సమయంలో అప్ డేట్ చేసుకుంటే ఇంకో పాన్ కార్డు వస్తుంది. దీనివల్ల కొందరి దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటాయి.
పాన్ కార్డు అనేది ప్రస్తుతం రోజుల్లో చాలా మంది వాడుతున్నారు. ఇది లేకపోతే అసలు ఈ రోజుల్లో ఏ పని కూడా సరిగ్గా కాదు. అన్ని విషయాలకు కూడా తప్పకుండా పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు అనేది ఒక్కోరికి ఒక్కో నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఒక్కోరికి ఒకటి మాత్రమే ఉంటుంది. గుర్తింపు కార్డు కోసం చాలా మంది దీన్ని వాడుతారు. అలాగే బ్యాంకు లావాదేవీలు, ఆదాయపు పన్ను వంటి విషయాలకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్