Tax returns: ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తున్నారా.. ఈ విషయాలు మరిచిపోవద్దు

Tax returns: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి సమయం ఇదే. ప్రస్తు్తం చాలా మంది దీన్ని రిటర్న్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే దీని కోసం అన్ని విషయాలు కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. మీరు పాత లేదా కొత్త పన్ను విధానాలలో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫారమ్ 16, 26 వంటి పత్రాలు తప్పకుండా ఉండాలి. ఏ విధంగా అయినా కూడా పన్ను దాఖలు చేస్తే తప్పకుండా కూడా కొన్ని విషయాలు ఎప్పుడూ మరిచిపోకూడదు. తెలిసో తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల మీరు ట్యాక్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి రిటర్న్ దాఖలు చేసే ముందు చేయకూడని మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పన్ను విధానాన్ని ఎంచుకోవాలి
పన్ను చెల్లింపుదారులు తప్పకుండా ఆదాయ స్థాయి ఎంత వరకు ఉంది? దానికి బట్టి పన్ను ఎంచుకోవాలి. అయితే పాత పన్ను విధానం అయితే ముందుగానే కంపెనీకి చెప్పాలి. అయితే కొత్త పన్ను విధానం అయితే కంపెనీకి చెప్పక్కర్లేదు. మీరు ఎంచుకున్న దాని బట్టి ముందుగా వారికి తెలియజేయాలి.
కంపెనీ టీడీఎస్
ప్రతీ నెల జీతం పొందే వారు కంపెనీ నుంచి తప్పకుండా ఫారం 16 పొందాలి. అప్పుడే మీకు పన్ను విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇది కంపెనీ టీడీఎస్ కింద ఎంత చూపిస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
టీడీఎస్‌తో చెకింగ్
పన్ను చెల్లింపుదారులు తప్పుకుండా ఫారం చెక్ చేయాలి. ఫారం 16లో ఇచ్చిన టీడీఎస్ డిటైల్స్ ఫారం 26ఏఎస్‌లోని టీడీఎస్ డేటాతో చెక్ చేయాలి. అయితే పన్ను చెల్లింపుదారుడి ఆదాయం బట్టి ఉంటుంది. టీడీఎస్ లేదా టీసీఎస్‌గా ఇలా అన్ని వివరాలు కూడా తెలుస్తాయి.
ఆస్తుల నుంచి ఆదాయం
జీతం పొందే వారు ఇంటి ఆస్తి నుంచి ఆదాయం పొందితే తప్పకుండా ఐటీఆర్-1ని దాఖలు చేయవచ్చు. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తి నుంచి ఆదాయం పొందితే ఐటీఆర్-2ని దాఖలు చేయాలి.
పాత పన్ను విధానం
హెచ్ఆర్ఏ ఆధారంగా మీరు పాత పన్ను విధానంలో పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు. అయితే అది కూడా మీకు అర్హత ఉంటేనే. లేకపోతే మాత్రం జీతం పొందే పన్ను చెల్లింపుదారుగా మాత్రమే కొత్త పన్ను విధానంలో రిటర్న్ దాఖలు చేయవచ్చు.
పెట్టుబడి పెట్టిన వాటి నుంచి
ఆదా చేసే పెట్టుబడులలో పెట్టి కూడా ఆదాయపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అయితే కొన్నింటికి వీలు ఉండదు. మరికొన్నింటికి వీలు ఉంటుంది. అయితే వీటి కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు ఉన్న వీలు బట్టి మీరు చేయవచ్చు.
షేర్లలో పెట్టుబడి పెట్టిన
జీతం పొందే పన్ను చెల్లింపు దారులు షేర్లులో పెట్టుబడి పెడితే తప్పకుండా ఐటీఆర్-2 ద్వారా వారి ఆదాయపు పన్ను రిటర్న్ ను దాఖలు చేయవచ్చు.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా