Tax: ఇలా చేస్తే కొన్ని లక్షలకు మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు.. ఎన్ని లక్షలకు అంటే?

Tax:
దేశంలో ప్రతీ ఒక్కరూ కూడా ట్యాక్స్ కట్టాలి. ఒక్కొక్కరి వచ్చే ఆదాయం బట్టి ట్యాక్స్ కడుతుంటారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రిలీజ్ చేశారు. అయితే ఏటా ట్యాక్స్‌ను మారుస్తుంటారు. ఈ క్రమంలో కొన్ని శ్లాబుల వారికి పన్ను ఉండదని తెలిపారు. మీ జీతం రూ.4 లక్షల కంటే తక్కువగా ఉంటే వారికి ఎలాంటి పన్ను కూడా కట్టక్కర్లేదు. అయితే శ్లాబుల వారీగా చూస్తే రూ.4 లక్షల తర్వాత కొంత ట్యాక్స్ కట్టాలి. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ట్యాక్స్ కట్టకుండా ఉండవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరి ట్యాక్స్ కట్టకుండా ఉండటానికి ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఉద్యోగికి కంపెనీ ఇచ్చే శాలరీలో బేసిక్ పే, ఇంటి అద్దె అలవెన్స్, ఆరోగ్య బీమా, ట్రావెల్ అలవెన్స్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీం వంటి అలవెన్సులు ఉంటాయి. అయితే మీకు సాధారణంగా వచ్చే ఈ అలవెన్స్‌లతో పాటు కొన్నింటిని జోడిస్తే పన్ను పూర్తిగా కట్టక్కర్లేదు. కొన్ని రకాల రీయింబర్స్‌మెంట్‌లను యాడ్ చేయడం వల్ల మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఉద్యోగులు ఇంటి నుంచి వర్క్ ప్లేస్‌కు రావడానికి కంపెనీలు కన్వీయన్స్ అలవెన్స్ ఇస్తాయి. వీటిని క్లెయిం చేసుకోవాలంటే ఉద్యోగులు ట్రావెలింగ్ ఖర్చుల బిల్లును యాజమాన్యానికి ఇవ్వాలి. అలాగే టెలిఫోన్, ఇంటర్నెట్ వినియోగానికి అయ్యే ఖర్చులను కూడా కొన్ని కంపెనీలు భరిస్తాయి. ఇలా కూడా రీయింబర్స్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే కొందరు సీనియర్ ఉద్యోగులు కంపెనీ వాహనాలు వాడుకోవచ్చు. ఇంధనం, డ్రైవర్ ఖర్చులకు కూడా ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ ఇస్తాయి. ఇలా మీకు వచ్చిన జీతంలో చేస్తే మీరు ఎలాంటి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు.
ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు తప్పకుండా ట్యాక్స్ కట్టాలి. అదే మీరు ఇలా అన్ని రీయింబర్స్‌మెంట్‌లు కంపెనీ నుంచి తీసుకుంటే మాత్రం మీరు రూ.12 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీ ఉన్నా కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. చాలా మంది ఐటీ ఎంప్లాయిస్ దీన్నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే ఎలాంటి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. అయితే అన్ని కంపెనీలు ఇలా రీయింబర్స్‌మెంట్‌లు ఇవ్వవు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇలా రీయింబర్స్‌మెంట్స్ ఇస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి.