Highest-Paid Person: ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి మన భారతీయుడే.. ఎంతంటే?
ఈ ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి ఎవరంటే అందరికి మొదట సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లే గుర్తు వస్తాయి. కానీ ఈ ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి భారత సంతతికి చెందిన వ్యక్తే. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా.

Highest-Paid Person: ఈ ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి ఎవరంటే అందరికి మొదట సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేర్లే గుర్తు వస్తాయి. కానీ ఈ ప్రపంచంలో అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి భారత సంతతికి చెందిన వ్యక్తే. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజా. గతేడాది ఈ ప్రపంచంలో అత్యధిక జీతం పొందిన వ్యక్తిగా నిలిచాడు. మొత్తం139.5 మిలియన్ డాలర్ల జీతం సంపాదించాడు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,150 కోట్లు అన్నమాట. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి ఉన్నత స్థాయిల వారి కంటే ఈ జీతం చాలా ఎక్కువ. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదివిన వైభవ్ తనేజా టెస్లా సీఎఫ్ఓ ఎలా అయ్యారు? అతని పూర్తి స్టోరీ చూద్దాం.
Read Also: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?
వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 1999 లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్‌లో జాబ్‌లో చేరాడు. ఆ తర్వాత 2006లో US లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (CPA) అయ్యాడు. ఆ తర్వాత 2016 లో సోలార్ సిటీలో చేరారు. 2017లో సోలార్‌సిటీ టెస్లాతో విలీనం కావడంతో వైభవ్ తనేజా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో తనేజా అంచెలంచెలుగా ఎదిగారు. అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్ నుంచి కార్పొరేట్ కంట్రోలర్‌గా మారాడు. ఆ తర్వాత 2019లో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా మారి.. అక్కడ నుంచి ఆగస్టు 2023లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీకి డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. భారత మార్కెట్లో టెస్లా వ్యూహాన్ని రూపొందించడంలో వైభవ్ తనేజా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంతకు ముందు టెస్లా కార్ల విలువ తక్కువగా ఉండేది. ఇప్పుడు పెరగడంతో వైభవ్ జీతం కూడా ఒక్కసారిగా పెరిగింది. వైభవ్ తనేజా వ్యూహాత్మక ఆలోచనలు ఉన్న వ్యక్తి. ఈ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
Read Also: ఆ ఏనుగుల బాధ్యత నాదే.. హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం
దశాబ్ద కాలంలో ఓ చీఫ్ ఫైనాన్స్‌కు లభించిన అత్యధిక ప్యాకేజీలలో ఇదొకటి. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల 2024లో ఆయన ఆదాయం అక్షరాలా రూ. 650 కోట్లు.అదే సమయంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ. 88 కోట్లు. వీరిద్దరినీ వైభవ్ రూ. 1,150 కోట్లు అధిగమించాడు. గతంలో నికోలా కార్పొరేషన్ సీఎఫ్ఓ 86 మిలియన్ డాలర్ల రికార్డును అధిగమించారు. గత కొన్నే్ళ్ల నుంచి టెస్లా కంపెనీ కొనుగోలు విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈ సమయంలో వైభవ్ జీతం పెరగడం గమనార్హం.