Richest Countries: ప్రపంచంలో ధనిక దేశాలు ఏంటో మీకు తెలుసా?

Richest Countries: ప్రపంచంలో 190కి పైగా దేశాలు ఉండగా అందులో కొన్ని మాత్రమే ధనిక దేశాలు ఉన్నాయి. మరికొన్ని పేద దేశాలు, ఇంకొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి. అయితే తాజాగా వరల్డ్ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో కొన్ని ధనిక దేశాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సింగపూర్
ప్రపంచ అట్లాస్ జాబితా ప్రకారం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ఇది అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. సింగపూర్ ఆర్థిక వ్యవస్థ అధిక ఆదాయం ఉంటుంది. ఈ ఏడాది పూర్తి అయ్యే సరికి ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రజా సేవల్లో భారీ పెట్టుబడులు వల్ల ఈ దేశం అత్యంత ధనిక దేశంగా మారింది.
లక్సెంబర్గ్
రెండవ స్థానంలో లక్సెంబర్గ్ ఉంది. ఇది బలమైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు బాగా ప్రసిద్ధి చెందింది. 2025 చివరికి ఈ దేశం తలసరి ఆదాయం ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఐర్లాండ్
ఈ దేశం గతంతో పోల్చితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు యూరప్‌లోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఐర్లాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడవ ధనిక దేశంగా ఐర్లాండ్ మారింది. ఈ అద్భుతమైన మార్పును “సెల్టిక్ టైగర్” అని అంటారు. అయితే ఈ ఏడాది పూర్తి అయ్యే సరికి ఇంకా తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఖతార్
మధ్య ప్రాచ్య దేశమైన ఖతార్ అత్యంత సంపన్న దేశాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ దేశం ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉంటుంది.
నార్వే
ఐరోపాలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటైన నార్వే ప్రపంచంలో ఐదవ ధనిక దేశం. ఇది పెట్రోలియం, సహజ వాయువు వంటి వనరులతో సమృద్ధిగా ఉంది. నార్వే అత్యంత అభివృద్ధి చెందిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. 2025 పూర్తి అయ్యే నాటికి నార్వే జీడీపీ 504.28 బిలియన్ డాలర్లు, తలసరి జీడీపీ 89,690 డాలర్లు ఉంటుందని అంచనా.
స్విట్జర్లాండ్
ప్రపంచ వ్యాప్తంగా సంపదలో ఆరవ స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో ఎక్కువగా ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో కేవలం 0.1% మాత్రమే ఉంది.
బ్రూనై
బ్రూనై ప్రపంచంలో ఏడవ ధనిక దేశం. దీని ఆర్థిక వ్యవస్థ పెట్రోలియం, సహజ వాయువు రంగాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ రంగాలు బ్రూనై జీడీపీకి ప్రధానంగా దోహదపడతాయి. జీడీపీ 16 బిలియన్ డాలర్లకు ఈ ఏడాది చేరుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
గయానా
ప్రపంచంలోని ఎనిమిదవ ధనిక దేశంగా గయానా నిలిచింది. 2015లో గణనీయమైన ఆఫ్షోర్ చమురు నిక్షేపాలను ఉన్నప్పటికీ దీని ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మారిపోయింది. ఈ దేశం తలసరి జీడీపీ 94,258 డాలర్లు (PPP)కి చేరుకుంటుందని అంచనా.
యునైటెడ్ స్టేట్స్
యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలో తొమ్మిదవ ధనిక దేశం. 2025 నాటికి జీడీపీ ప్రకారం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఏకైక దేశం ఇది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం దాని సేవా రంగం. జీడీపీలో 80.2% వాటా ఉంది.
డెన్మార్క్
అధిక ఆదాయం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన డెన్మార్క్, ప్రపంచంలోని పది ధనిక దేశాలలో ఒకటిగా ఉంది.