Blood Group: రేర్‌గా కనిపించే బ్లడ్ గ్రూప్.. ప్రపంచంలో వంద మంది కూడా లేరే.. ఇంతకీ ఆ బ్లడ్ గ్రూప్ ఏదంటే?

Blood Group:
మనలో చాలా మందికి కొన్ని రకాల బ్లడ్ గ్రూప్‌ల గురించి మాత్రమే తెలుసు. ఎక్కువగా A, B, O, AB బ్లడ్ గ్రూప్‌ల గురించి వింటుంటారు. అయితే మనకి తెలియని ఓ బ్లడ్ గ్రూప్ కూడా ఉంది. అదే గోల్డెన్ బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ గ్రూప్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసు. పొరపాటున ఎవరైనా మనకి నీది ఏ బ్లడ్ గ్రూప్ అంటే.. A, B, O, AB పాజిటివ్ లేదా నెగిటివ్ ఇలా ఏదో ఒకటి చెబుతుంటాం. మనం ఇతరులకు అడిగినా కూడా ఇందులో ఏదో ఒక బ్లడ్ గ్రూప్ చెబుతుంటాం. కానీ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి చెప్పం. అయితే ఈ బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. దీన్ని శాస్త్రీయ నామం ఆర్‌హెచ్ నల్ (Rh Null). ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 45 మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. వీరంతా జపాన్, ఐర్లాండ్, అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో మాత్రమే నివసిస్తున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్ అరుదు అని ఎందుకు అంటారంటే.. ఈ గ్రూపులో యాంటీజెన్ ఉండదు. అలాగే రక్త కణాల్లో ప్రోటీన్ ఉండదు. అందుకే దీన్ని అరుదైన బ్లడ్ గ్రూప్ అంటారు. మిగతా అన్ని బ్లడ్ గ్రూపుల్లో ఎర్ర రక్త కణాలలో ప్రోటీన్ ఉంటుంది. కానీ గోల్డెన్ బ్లడ్ గ్రూప్‌లో మాత్రం ఉండదు.
ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ శరీరంలో జరిగే మ్యుటేషన్ వల్ల ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మ్యుటేషన్ శరీరంలో Rh ప్రోటీన్ ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుంది. దీంతో ప్రోటీన్ లేకుండా రక్తవర్గం ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. అయితే మిగతా బ్లడ్ గ్రూప్‌తో పోలిస్తే.. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి పెద్దగా అనారోగ్య సమస్యలు రావు. వీరు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. కానీ రక్త హీనత సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్‌ను శాస్త్రవేత్తలు 1960లో కనిపెట్టారు. వీరికి రక్తహీనత సమస్య రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఇనుము అధికంగా పదార్థాలు తీసుకోవాలి. అయితే వీరికి బ్లడ్ దొరకడం చాలా కష్టం. అందుకే ముందుగానే ఈ బ్లడ్ గ్రూప్‌ను నిల్వ చేస్తారు. అయితే ఈ బ్లడ్ గ్రూప్‌ను పెద్దగా ఎవరికి దానం చేయరు. బ్లడ్‌ను ఒక వ్యక్తి నుంచి తీసి నిల్వ చేస్తారు. మళ్లీ ఆ వ్యక్తికి అవసరం అయినప్పుడు తనకే ఎక్కిస్తారు. వీరందరికి ఒక నెట్ వర్క్ కూడా ఉంటుంది. అందులో అందరి పేర్లు కూడా నమోదు చేసుకుంటారు. దీనివల్ల అవసరం అయినప్పుడు ఇతరులు సాయం చేసే అవకాశం ఉంటుంది.