iPhone : పాత ఐఫోన్‌ను కొత్తగా మార్చే అప్‌డేట్.. iOS 18.5 ఫీచర్లు ఇవే!
iPhone : ఆపిల్ ఫోన్లకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆపిల్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది.

iPhone : ఆపిల్ ఫోన్లకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆపిల్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఆపిల్ కంపెనీ ఐపోన్ కోసం సరికొత్త iOS 18.5 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త అప్‌డేట్ బగ్ ఫిక్స్‌లతో పాటు కొన్ని అద్భుతమైన కొత్త ఫీచర్లతో వస్తోంది. కొత్త అప్‌డేట్‌తో మీకు కొత్త వాల్‌పేపర్‌లు, ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్ల సపోర్ట్ లభిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ మీకు అందుబాటులో ఉందో లేదో, అప్‌డేట్‌లో కొత్తగా ఏమున్నాయి.. ఈ అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి వంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
iOS 18.5 ఫీచర్లు:
ఇంప్రూవుడ్ మెయిల్ యాప్: ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో కంపెనీ మెయిల్ యాప్‌లో యూజర్ల సౌలభ్యం కోసం ఆల్ మెయిల్ అనే కొత్త సెక్షన్‌ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒకేసారి అన్ని మెయిల్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ రావడం వల్ల యూజర్లు ఇకపై మెయిల్ బాక్స్‌లో కనిపించే కేటగిరీల మధ్య మారాల్సిన అవసరం ఉండదు.
ఇంప్రూవుడ్ పేరెంటల్ కంట్రోల్: ఈ ఫీచర్ ఇప్పుడు తల్లిదండ్రులు చైల్డ్ స్క్రీన్ టైమ్ పాస్‌కోడ్‌ను ఉపయోగించినప్పుడు నోటిఫై చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు అనధికారిక డివైజ్ సెట్టింగ్ మార్పులను కూడా గమనించవచ్చు.
ఐఫోన్ 13 శాటిలైట్ కనెక్టివిటీ: ఇంతకు ముందు శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ కేవలం ఐఫోన్ 14, కొత్త మోడళ్ల కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఐఫోన్ 13 యూజర్ల కోసం కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెట్‌వర్క్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో ఈ ఫీచర్ యూజర్లకు మెరుగైన కమ్యూనికేషన్‌లో సహాయపడుతుంది.
iOS 18.5 సపోర్ట్ చేసే డివైజ్‌లు:
2018 తర్వాత వచ్చిన అన్ని ఐఫోన్ మోడళ్లు అంటే iPhone XR, XS Max, XS, SE మోడళ్లు, iPhone 13, 12, లేటెస్ట్ iPhone 16 సిరీస్ ఈ కొత్త అప్‌డేట్‌కు అనుకూలంగా ఉంటాయి.
ఇలా ఇన్‌స్టాల్ చేసుకోండి
అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. తర్వాత Generalపై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మీరు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. కంపెనీ నుంచి మీకు అప్‌డేట్ అందుబాటులో ఉంటే అక్కడ కనిపిస్తుంది. అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు ఆరు అంకెల పాస్‌కోడ్‌తో కన్ఫాం చేయాలి.