Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
Iphone: ఐఫోన్ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా కొందరు తమ ప్లాన్ ను మార్చుకుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కుందాంలే అని వెనక్కి తగ్గుతారు

Iphone: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్.. వదిలారో మళ్లీరాదు!
ఐఫోన్ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర కారణంగా కొందరు తమ ప్లాన్ ను మార్చుకుంటారు. ఎప్పుడైనా ఆఫర్లు వస్తే అప్పుడు కొనుక్కుందాంలే అని వెనక్కి తగ్గుతారు. అలాంటివారి కోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 16 ఫోన్ ను అతి తక్కువ ధరలో కొనుక్కునే ఛాన్స్ దొరికింది. ఈ ఫోన్ 128 GB వేరియంట్ అసలు ధర రూ.79,900 గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దీనిని అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ క్రోమాలో ఏకంగా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ.8,410 తగ్గింపు పొందొచ్చు. దీంతో ఐఫోన్ 16 బేస్ వేరియంట్ ను కేవలం రూ. 71,490లకే సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ 128 జీబీ వేరియంట్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ICICI, SBI, కొటక్ బ్యాంక్ వంటి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లపై అదనంగా మరో రూ. 4000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ తగ్గింపుతో మీరు ఐఫోన్ 16 బేస్ మోడల్ ను రూ. 67,490 లకే కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్లొచ్చు. ఇవి మాత్రమే కాకుండా వీటితో పాటు ఎక్సేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.60,766 డిస్కౌంట్ పొందొచ్చు. అయితే పాత ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. మోడల్ బట్టి ఎక్సైజ్ డిస్కౌంట్ నిర్ణయిస్తారు. ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఎక్సేంజ్ ధర ఇస్తారు. లేదంటే మీ జేబులోంచి మరింత డబ్బు పెట్టాల్సి ఉంటుంది.
ఇక ఐఫోన్ 16 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులోని డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంటుంది. వీడియో గాని ఫోటో గాని ఏదైనా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్ గా ఉంటుంది. అలాగే ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా అందించారు. ఇది అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు మ్యాగ సేఫ్ సపోర్ట్ ఉండటంవల్ల వైర్లెస్ చార్జింగ్ కూడా మద్దతు ఇస్తుంది. ఇందులో కెమెరా కంట్రోల్ కోసం ఒక స్పెషల్ బటన్ కూడా అందించారు. వీటితోపాటు మరెన్నో అద్భుతమైన, అధునాతన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!
-
Bikes: బెస్ట్ మైలేజ్ బైక్స్.. ఒకసారి ట్యాంక్ నింపితే 10సార్లు తిరొగొచ్చు!
-
Lenovo: ప్రపంచంలో మొట్టమొదటి సోలార్ ల్యాపీ.. 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉంటే చాలు
-
Motorola: మోటారోలా నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు