Yamaha : కొనండి… మరచిపోండి.. 10 ఏళ్లు నో టెన్షన్.. యామహా అదిరిపోయే వారంటీ ఆఫర్!

Yamaha : టూ వీలర్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ వాహన తయారీ సంస్థ యామాహా మోటార్ తన వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై యామాహా స్కూటర్లు, బైక్‌లపై ఏకంగా 10 సంవత్సరాల వారంటీ అందిస్తుంది. ఈ వారంటీలో 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో పాటు అదనంగా 8 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా వర్తిస్తుంది. ఇంజిన్, ఎలక్ట్రికల్ భాగాలతో పాటు ఫ్యూయల్ ఇంజెక్షన్ (Fi) సిస్టమ్ కూడా ఈ వారంటీ పరిధిలోకి వస్తుంది. స్కూటర్లపై లక్ష కిలోమీటర్ల వరకు, భారతదేశంలో తయారైన మోటార్‌సైకిళ్లపై 1.25 లక్షల కిలోమీటర్ల వరకు ఈ వారంటీ కవరేజ్ ఉంటుంది.
యామాహా అందిస్తున్న ఈ ప్రత్యేకమైన వారంటీ ప్లాన్ ప్రకారం.. స్కూటర్లకు ప్రామాణిక వారంటీ 24,000 కిలోమీటర్లు కాగా, ఎక్స్‌టెండెడ్ వారంటీ 76,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అదే మోటార్‌సైకిళ్లకు అయితే, స్టాండర్డ్ వారంటీ 30,000 కిలోమీటర్లు, ఎక్స్‌టెండెడ్ వారంటీ 95,000 కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది. యామహా హైబ్రిడ్ స్కూటర్ సిరీసులో రే ZR Fi, ఫాసినో 125 Fi వంటి మోడళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఏరోక్స్ 155 అనే ఒక మ్యాక్సీ-స్కూటర్‌ను కూడా ఈ బ్రాండ్ కలిగి ఉంది. భారతదేశంలో తయారైన మోటార్‌సైకిళ్లలో FZ సిరీస్, R15, MT-15 వంటి పాపులర్ మోడళ్లు ఉన్నాయి. యామాహా MT-03, YZF-R3 వంటి ప్రీమియం బైక్‌లను కూడా విక్రయిస్తోంది.
Read Also:AI Hospital : ప్రపంచపు మొట్టమొదటి AI ఆస్పత్రిని ప్రారంభించిన చైనా.. డాక్టర్లంతా రోబోలే
ఇదిలా ఉండగా యామాహా తన ఏరోక్స్ 155 S స్కూటర్‌ను తాజాగా కొత్త కలర్ ఆప్షన్లతో విడుదల చేసింది. ఇప్పుడు ఇది కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా OBD2 ఇంజన్‌తో వస్తుంది. కొత్త కలర్ ఆప్షన్లలో ఐస్ ఫ్లూవో వెర్మిలియన్, రేసింగ్ బ్లూ ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,53,430గా నిర్ణయించబడింది. అయితే, ప్రస్తుతం ఉన్న మెటాలిక్ బ్లాక్ వేరియంట్ ₹1,50,130 ఎక్స్-షోరూమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఏరోక్స్ ఇప్పటికీ బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే లభిస్తుంది.
యామాహా ఏరోక్స్ 155 శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంది. ఇందులో లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్ SOHC, 155సీసీ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 8,000 rpm వద్ద 14.8 bhp పవర్, 6,500 rpm వద్ద 13.9 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇంజన్‌లో వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) టెక్నాలజీ ఉంది. ఇది E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటుంది.
Read Also:Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
ఈ స్కూటర్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే S ట్రిమ్‌లో కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్ ఉంది. ఇది స్టార్ట్-అప్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీనితో రైడర్‌కు కీని ఉపయోగించాల్సిన అవసరం లేదు. స్కూటర్ కీని గుర్తించడానికి ప్రాక్సిమిటీ డిటెక్షన్‌ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా రైడర్ కేవలం ఒక రొటేటింగ్ నాబ్‌ను తిప్పడం ద్వారా స్కూటర్‌ను స్టార్ట్ చేయవచ్చు. యామాహా అందిస్తున్న ఈ 10 సంవత్సరాల వారంటీ ఆఫర్ అమ్మకాలు పెరగడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.