Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి పేరుతో మరో మోసం.. కేసు నమోదు

Harsha Sai: టాప్ యూట్యూబర్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో మంచి పనులు చేస్తూ.. యూట్యూబ్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో ప్రమోషన్లు, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు. వీటితో ఎందరో పేద వాళ్లకు సాయం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల ఓ కేసులో హర్షసాయి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఓ మహిళపై అత్యాచార కేసు విషయంలో ఇతనిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హర్ష సాయి మరో కేసులో ఇరుక్కున్నాడు. హర్ష సాయి (Harsha Sai) మనుషులమని సాయం చేప్తామని నమ్మించి మోసం కొందరు దుండగులు మోసం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలోని మిడ్జిల్ మండలానికి చెందిన బరిగెల ఆంజనేయులు తండ్రి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రికి చికిత్స చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. దీంతో అతను హర్ష సాయిని సంప్రదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో హర్ష సాయికి మెసేజ్ చేశాడు. అతను మరి ఏ అకౌంట్‌కి చేశాడో.. కానీ కొందరు దుండగులు సాయం చేస్తామని మోసం చేశారు. హర్ష సాయి ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నామని తప్పకుండా మీకు సాయం చేస్తామని నమ్మించారు. రూ. 4 లక్షల వరకు సాయం చేస్తామని అనగానే ఆ వ్యక్తి కూడా నమ్మాడు. అయితే మీకు సాయం చేయాలంటే డాక్యుమెంట్ ఛార్జ్ కింద ముందుగా కొంత డబ్బులు పే చేయాలని తెలిపారు. ఒక నంబర్ పంపిస్తాం.. దానికి డబ్బులు పంపించాలని తెలిపారు. దీంతో ఆ వ్యక్తి రూ.22,500 పంపించాడు.
హర్ష సాయి ఆఫీస్ అని నమ్మడంతో ఆ వ్యక్తి డబ్బులు అయితే పంపించాడు. వెంటనే అటు నుంచి రూ.5000 మాత్రమే పంపించారు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు పంపలేదు. ఫోన్ స్వీఛాఫ్ చేసేశారు. దీంతో మోసపోయానని ఆంజనేయులు గ్రహించి వెంటనే పోలీసులను సంప్రదించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హర్ష సాయి ఆఫీసు అని చెప్పడం ఏంటి? ఇలా హర్ష సాయి చేయింపించాడా? లేకపోతే వేరే ఇతరులు ఎవరైనా హర్ష సాయి పేరు మీద చేశారా? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేపట్టారు. ఇది వరకే ఓ కేసు హర్ష సాయి మీద ఉంది. దీంతో మళ్లీ కేసులు మీద కేసులు అంటే కష్టమే. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనే ఆరోపణల విషయంలో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులోనే ఉంది.