Viral : వింత, దారుణ ఘటన.. కోడలి కిడ్నీనే వరకట్నంగా అడిగిన అత్తామామలు

Viral : సాధారణంగా సమాజంలో వరకట్నంగా కార్లు, ఇళ్లు, బంగారం, ఆస్తులు అడిగే పద్ధతి మొదటి నుంచీ ఉంది. ఇప్పుడు వరకట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం అని తెలిసినా, కొన్ని చోట్ల రహస్యంగా ఈ వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే, బీహార్‌కు చెందిన ఒక మహిళకు వింత అనుభవం ఎదురైంది. అత్తమామలు ఆమెను బైక్, నగదు, ఆభరణాలు తీసుకురాలేకపోతే, తన భర్తకు తన కిడ్నీనే వరకట్నంగా ఇవ్వమని పీడించారు.
ముజఫర్‌పూర్‌లో విచిత్ర ఘటన
తమ కొడుకు కోసం కోడలి కిడ్నీని వరకట్నంగా డిమాండ్ చేసిన ఈ విచిత్ర సంఘటన ఉత్తర బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగింది. ఈ విషయంపై దీప్తి అనే మహిళ ముజఫర్‌పూర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు తాను ఎదుర్కొన్న దౌర్జన్యాన్ని వివరిస్తూ.. “నేను 2021లో వివాహం చేసుకున్నాను. నా అత్తమామల ఇల్లు ముజఫర్‌పూర్‌లోని బోచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. పెళ్లి తర్వాత మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అత్తమామలు మానసికంగా వేధించడం ప్రారంభించారు. శారీరకంగా దాడి చేశారు. నా తల్లిదండ్రుల ఇంటి నుండి బైక్, డబ్బులు తీసుకురావాలని అడిగారు” అని దీప్తి చెప్పింది.
Read Also:Nithin Thammudu Movie Trailer: నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్ వచ్చేసింది.. వీడియోపై ఓ లుక్కేయండి
కిడ్నీ దానం చేయమని ఒత్తిడి
అత్తమామల డిమాండ్లను ఒప్పుకోవడం దీప్తికి సాధ్యం కాలేదు. అప్పుడు ఆమె అత్తమామలు.. ” అనారోగ్యంతో ఉన్న భర్తకు నా కిడ్నీల్లో ఒకదాన్ని దానం చేయమని బలవంతం చేయడం ప్రారంభించారు. నా పెళ్లి అయిన రెండు సంవత్సరాల తర్వాత నా భర్తకు కిడ్నీ వ్యాధి ఉందని నాకు తెలిసింది. కిడ్నీ ఇవ్వమని నన్ను ఒత్తిడి చేశారు, కొట్టారు, పీడించారు” అని ఆమె పేర్కొంది.
“ఆ తర్వాత నేను నా మా ఇంటికి వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను” అని దీప్తి వివరించింది. పోలీసులు ఇరు పక్షాల మధ్య రాజీని కుదర్చడానికి ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. దీప్తికి తన భర్త నుండి విడాకులు తీసుకోవాలని పోలీసులు సలహా ఇచ్చారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో 38/25 కేసు నమోదు చేయబడింది. ఇందులో ఆమె భర్తతో సహా ఆమె అత్తమామల కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను నిందితులుగా చేర్చారు.
Read Also:Chanakyaniti: ఎలాంటి ప్రదేశాల్లో ఉండకూడదు.. చాణక్య నీతి ఏం చెబుతోంది?