Central Government Jobs : నిరుద్యోగులు ఇది మీ కోసమే.. సెలక్ట్ అయితే లక్షకు పైగా జీతం
Central Government Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని కాకుండా కొన్ని రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇండియన్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, బెనిఫిట్స్ ఉంటాయని వీటిలో జాయిన్ కావాలని అనుకుంటారు. అయితే ఈ ఉద్యోగాలకు మంచిగా ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్పోర్టు అథారిటీలో ఉద్యోగాలు ఉంటాయి.

Central Government Jobs : మిగతా ఉద్యోగాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని కాకుండా కొన్ని రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇండియన్ సర్వీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, బెనిఫిట్స్ ఉంటాయని వీటిలో జాయిన్ కావాలని అనుకుంటారు. అయితే ఈ ఉద్యోగాలకు మంచిగా ప్రిపేర్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎయిర్పోర్టు అథారిటీలో ఉద్యోగాలు ఉంటాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా కూడా బాగుంటాయి. అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగం) పదవికి 309 ఖాళీలను AAI ATC రిక్రూట్మెంట్ 2025 ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
భారతదేశ వైమానిక ప్రదేశంలో పౌర విమానయాన మౌలిక సదుపాయాలను సృష్టించడం, అప్గ్రేడ్ చేయడం, నిర్వహించడం, నిర్వహించడం వంటి వాటిలో భర్తీ చేయనుంది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ నుంచి దరఖాస్తు ప్రారంభమవుతుంది. వీటికి అప్లై చేసుకోవాలనుకునే వారు https://aai.aeroలోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రిక్రూట్మెంట్ 2025లో మొత్తం 309 ఖాళీలు ఉన్నాయి. వీటిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మే 24 చివరి తేదీ. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకోయాక్టివ్ సబ్స్టాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పోస్టు బట్టి ఉంటుంది. ఈ పరీక్షలకు సెలక్ట్ అయితే రూ.40000 నుంచి రూ.140000 వరకు జీతం ఉంటుంది.
ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగంల మొత్తం 309 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే సంబంధిత పోస్టుల బట్టి అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే వీటికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే రూ.1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు, అప్రంటీసులకు అయితే ఫీజులో మినహాయింపు ఉంటుంది