Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లో ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరంటే?

Bigg Boss: బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ అంటే చాలా మందికి పిచ్చి. ఈ షో వస్తుందంటే అందరూ టీవీల ముందు కూర్చోని ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. విదేశాల్లో ఉన్న ఈ బిగ్ బాస్‌ను మొదట హిందీలో తీసుకొచ్చారు. అందులో గ్రాండ్ సక్సెస్ కావడంతో మిగతా భాషల్లో కూడా తీసుకొచ్చారు. ఏ భాషలో బిగ్ బాస్‌ను తీసుకొచ్చినా కూడా హిట్ అయ్యింది. బిగ్ బాస్‌కి ప్రస్తుతం మంచి పాపులారిటీ ఉంది. సినిమాలకు దూరంగా ఉన్న నటులు, ఫేమస్ కోసం ట్రై చేస్తున్న వారికి బిగ్ బాస్ ఒక జీవితాన్ని అందించింది. తెలుగులో అయితే ఇప్పటి వరకు మొత్తం 8 సీజన్లు అయ్యాయి. త్వరలోనే 9వ సీజన్ కూడా ప్రారంభం కానున్నట్లు స్టార్ మా ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రొమోను కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్‌లో ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం కానుంది. అయితే బిగ్ బాస్‌లోకి పరిచయం లేని వారంతా వెళ్తారు. కానీ ఆ షోలో ప్రాణానికి మించి స్నేహితులు, లవర్స్‌గా మారుతుంటారు. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి ప్రేమించి.. చివరకు అతను ఒప్పుకోకపోవడంతో ఓ మహిళా కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటుచేసుకుందని ఇటీవల ఎండోమెల్ షైన్ ఇండియా లో బిగ్ బాస్ ప్రాజెక్ట్ హెడ్ గా పనిచేస్తున్న అభిషేక్ ముఖర్జీ దీనిపై తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన వాటిపై ఈ విషయాలు తెలిపాడు.
బిగ్ బాస్ హౌస్‌కి వచ్చిన ఓ నటికి బయటే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అన్ని మరిచిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుంది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో కూడా మళ్లీ ప్రేమలో పడింది. పోనీ ఈ ప్రేమ అయినా కూడా సక్సెస్ అయితే బాగున్ను. కానీ అలా కాకుండా హౌస్ లోపల కూడా తన ప్రేమ పోయింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఓ కంటెస్టెంట్‌తో ప్రేమలో పడింది. కానీ ఆ వ్యక్తి ఆమెను ప్రేమించలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఆట కోసం ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. మొదట్లో ఈ విషయం ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఆ నటికి ఈ విషయం తెలియడంతో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. తీవ్రంగా మనస్తాపానికి గురై బాత్ రూమ్ కి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే వెంటనే ఇతర హౌస్ మేట్స్ ఆ విషయాన్ని గమనించారు. వెంటనే ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ఆమె మెంటల్ స్థితిని చెక్ చేసి వచ్చే వారం ఆమెను ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. అయితే ఇంతకీ ఆ నటి ఎవరనే విషయాన్ని మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. అయితే తమిళ బిగ్ బాస్ లో ఇలా ఒకసారి జరిగింది. ఓవియా అనే యువతి ఆరవ్ అనే వ్యక్తిని ప్రేమించింది. కానీ అతను తన ప్రేమను వ్యతిరేకించాడు. దీంతో ఆమె సూసైడ్ చేసుకునే వరకు వెళ్లిందని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Rashmika : స్టార్ హీరోల లక్కీ హీరోయిన్ రష్మిక.. అల్లు అర్జున్‌తో నాలుగోసారి!