Bollywood Heroine : త్వరలో రాజకీయాల్లోకి మహేష్ బాబు హీరోయిన్.. క్లారిటీ ఇస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన బ్యూటీ..

Bollywood Heroine :
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అవసరం లేదు. ప్రీతి జింటా తెలుగులో హీరో మహేష్ బాబుకు జోడిగా రాజకుమారుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది.మొదటి సినిమాతోనే ఈ అమ్మడు తన అందంతో, అభినయంతో అందరిని కట్టిపడేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో హీరోగా రాజకుమారుడు మొదటి సినిమా. బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు, ప్రీతి జింటా జంటగా నటించిన రాజకుమారుడు సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ప్రీతి జింటా విక్టరీ వెంకటేష్ కు జోడిగా ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ప్రీతి జింటా తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో కంటిన్యూ అయ్యింది. 1998లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన దిల్ సే సినిమాతో ప్రీతిజింతా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె సోల్జర్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రీతి జింటా హిందీ తో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ గత కొంతకాలం నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ వరుస పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది.
ఈ మధ్యకాలంలో హీరోయిన్ ప్రీతి జింటా సోషల్ మీడియాలో ప్రతి విషయంపై స్పందిస్తూ సెన్సేషనల్ పోస్టులతో బీభత్సం క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ఆమె కాంగ్రెస్ పార్టీ గురించి దారుణమైన పోస్టులు పెట్టి కొంతమంది నాయకులను ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీతి జింటా త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి. దీనిమీద తాజాగా ప్రీతి జింటా ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. జవాన్ల కుటుంబంలో పుట్టావు కాబట్టి నువ్వు కూడా నా దృష్టిలో జవానువే. నీ ప్రతిభకు హాట్సాఫ్. రాజకీయాల్లో చేరాలనుకునే ఆలోచనలు ఉన్నాయా అంటూ ఓ అభిమాని పోస్ట్ చేయగా దీనిపై ప్రీతి జింటా స్పందించింది.
నాకు అలాంటి ఆలోచనలు లేవు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు నాకు టికెట్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశాయి. కానీ నేను మర్యాదపూర్వకంగా వాటిని తిరస్కరించాను. నాకు ఈ రంగంపై ఆసక్తి లేదు. నేను సోల్జర్ అని పిలవడం తప్పుకాదు. నేను ఒక సైనికుడి కుమార్తెను అలాగే సైనికుడు సోదరిని కూడా. మేము ఉత్తర భారతీయులం, దక్షిణ భారతీయులం, బెంగాలీలము కాదు మేము భారతీయులం. దేశభక్తి జాతీయ గర్వం మా రక్తంలోనే ఉంది అంటూ రాసుకొచ్చింది ప్రీతిజింతా. ప్రస్తుతం ఈమె చేసిన పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
No ! No politics for me. Over the years, various political parties have offered me tickets & Rajya Sabha seats but I have politely declined as it’s not what I want. Calling me a soldier is not completely wrong because I am a soldier’s daughter & a soldiers sister 😀 We fauji… https://t.co/9FZLpLKNP1
— Preity G Zinta (@realpreityzinta) February 27, 2025
-
Bollywood Heroine : హాట్ బ్యూటీగా ఫుల్ క్రేజ్.. కేవలం 2 సినిమాలే చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటుంది…ఎవరంటే..
-
Bollywood Heroine: టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న కూడా బాలీవుడ్ వైపు వెళ్లిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా…
-
Viral Photo : మోటార్ సైకిల్ పై ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టగలరా..